ETV Bharat / city

తల్లీకుమార్తెల ఆత్మహత్య కేసు.. ఎస్సైపై సస్పెన్షన్​ వేటు - Officials have suspended Pedavegi SI

Pedavegi SI Suspended: ఏపీలో ఏలూరు జిల్లాలోని ఎస్సై సత్యనారాయణపై సస్పెన్షన్​ వేటు పడింది. తల్లీకుమార్తెల ఆత్మహత్య కేసులో ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై డీఐజీ పాలరాజు ఎస్సై సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

SI Suspended In Eluru District
SI Suspended In Eluru District
author img

By

Published : Sep 25, 2022, 4:00 PM IST

Pedavegi SI Suspended: ఆంధ్రప్రదేశ్​లో ఏలూరు జిల్లా పెదవేగి ఎస్సై సత్యనారాయణపై సస్పెన్షన్‌ వేటు పడింది. మండలంలోని వేగివాడలోని ఆత్మహత్య చేసుకున్న తల్లీకుమార్తెల కేసులో అలసత్వం వహించారని మృతుల బంధువులు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సత్యనారాయణ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని దర్యాప్తులో తేలింది. దీనిపై ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు ఎస్సై సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీసుల నిర్లక్ష్యం వల్లే..: ‘ఈ ఘటనపై పెదవేగి పోలీసులకు ఈ నెల 13న ఫిర్యాదు చేశాం. తరువాత మాట్లాడదామని ఎస్సై సత్యనారాయణ చెప్పారు. అప్పటినుంచి చిట్టిబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపించారు. బాలిక చనిపోయాక పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని.. ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వారు బలయ్యారని విమర్శించారు. వారు ఫిర్యాదు చేసింది వాస్తవమేనని.. తాము కూర్చుని మాట్లాడుకుంటామని చెప్పి వెళ్లారని ఎస్సై సత్యనారాయణ వివరణ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే: వేగివాడకు చెందిన బాలిక (17) పదో తరగతి చదివి ఇంటి వద్ద ఉంటోంది. ఆమెకు దెందులూరు మండలం కొత్తపల్లికి చెందిన తాపీ పనులకు వెళ్లే యువకుడు కాట్రు చిట్టిబాబు పరిచయమయ్యాడు. అతడు ఈనెల 12న బాలికకు మాయమాటలు చెప్పి ద్విచక్రవాహనంపై ఏలూరుకు తీసుకెళ్లాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఫొటోలు తీశాడు. విషయం బయటకు చెబితే ఫొటోలను గ్రామంలోని యువకులకు చూపిస్తానని బెదిరించాడు.

13వ తేదీ సాయంత్రం ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. విషయం గ్రామస్థులకు తెలిస్తే ఎక్కడ పరువు పోతుందోనని ఆందోళనకు గురై తల్లీకుమార్తె 16వ తేదీన ఇంటి వద్ద కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. గమనించిన కుటుంబసభ్యలు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి.. అక్కడినుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక శుక్రవారం మధ్యాహ్నం, తల్లి శనివారం ఉదయం చనిపోయారు.

ఇవీ చదవండి: పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిలో పాల్గొన్న హరియాణా గవర్నర్​

షహీద్​ భగత్ సింగ్​ విమానాశ్రయంగా చండీగఢ్ ఎయిర్​పోర్ట్​: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.