ETV Bharat / city

మునుగోడులో గెలిస్తే ఏం చేస్తారో వారిద్దరూ చెప్పలేదన్న మల్లు రవి - మల్లు రవి తాజా వార్తలు

Mallu Ravi on munugodu bypoll మునుగోడులో తెరాస, భాజపా నిర్వహించిన బహిరంగ సభలపై పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్‌తో మళ్లీ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారన్నారని వ్యాఖ్యానించారు. మునుగోడులో గెలిస్తే ఏం చేస్తారని కేసీఆర్, అమిత్ షా చెప్పలేదని పేర్కొన్నారు. బహిరంగ సభల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొనేందుకే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు.

Mallu Ravi
Mallu Ravi
author img

By

Published : Aug 22, 2022, 5:26 PM IST

Mallu Ravi on munugodu bypoll భాజపా, తెరాస బహిరంగ సభలు రెండూ రాజకీయాల చుట్టే తిరిగాయని.. సామాన్య ప్రజల సమస్యలపై ఒక్కరూ ప్రస్తావించలేదని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. గాంధీ భవన్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సెంటిమెంట్‌తో మళ్లీ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారన్నారు. మునుగోడులో గెలిస్తే ఏం చేస్తారని కేసీఆర్, అమిత్ షా చెప్పలేదని పేర్కొన్నారు. బహిరంగ సభల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొనేందుకే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. ఎన్నికల హామీల అమలు ప్రస్తావన ఎక్కడా రాలేదన్నారు. తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లే అని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవకూడదనే భాజపా, తెరాస పరస్పరం తిట్టుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడిన ప్రధాని మోదీ, అమిత్ షా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మల్లు రవి ప్రశ్నించారు.

అక్రమాల్లో పోటీ పడుతున్నారు.. బహిరంగ సభలకు జనం వచ్చినంత మాత్రాన ఓట్లు రావు అని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేసీఆర్ మునుగోడులో సెంటిమెంట్‌తో గెలవాలని చూస్తున్నారన్నారు. ఇన్ని రోజులు మునుగోడుకు చేసిందేమిటో సీఎం ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. భాజపా, తెరాస నేతలు అక్రమాల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని పొన్నాల ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది.. దేశాన్ని మోదీ.. రాష్ట్రాన్ని కేసీఆర్.. అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలు చేసిన వారు జైల్లో ఉండాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన కాంగ్రెస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.