ETV Bharat / city

pawan kalyan comments: 'తొక్కే కొద్దీ పైకి లేస్తాం.. తగ్గే ప్రసక్తే లేదు' - pawan kalyan latest news

ఏపీలోని రాజమహేంద్రవరంలో జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​ పర్యటించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప వంగేది లేదని వైకాపా నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండాలని వచ్చినట్టు స్పష్టం చేశారు.

pawan kalyan comments on ysrcp leaders at rajamahendravaram

author img

By

Published : Oct 2, 2021, 2:59 PM IST

Updated : Oct 2, 2021, 5:11 PM IST

బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగం

తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప వంగేది లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏపీలోని రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉందని... ప్రజలకు ఉన్న హక్కునూ ఎవరూ ఆపలేరని పవన్​కల్యాణ్​ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కును అడ్డుకోలేరని సూచించారు. వీర మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడమే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నట్టు ఉద్ఘాటించారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండాలని వచ్చినట్టు స్పష్టం చేశారు.

నా సహనాన్ని తేలిగ్గా తీసుకోకండి..

"రాజకీయ పార్టీ నడపటం అంత సులువు కాదు. శ్రమదానం నాకు సరదా కాదు. రాజకీయం అనేది కష్టమైన ప్రక్రియ. నేను నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చా. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వం ఖాజానాకు వెళ్తాయి. ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. యాక్షన్‌, కెమెరా, కట్‌ అని వెళ్లే వ్యక్తిని కాదు. పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు."- పవన్​కల్యాణ్​, జనసేన అధ్యక్షుడు

సీఎం అయ్యాకే సీఎం అని పిలవండి..

"నా కోసమే ఆలోచిస్తే తిట్టినవారిని కింద కూర్చోబెట్టి నార తీసేవాడిని. మానసిక అత్యాచారాలు ఇంతకాలం పడ్డా.. ఇక పడేది లేదు. ప్రజల కోసమే తిట్లు తింటున్నా. ఇంతకాలం మానసిక అత్యాచారాలు భరించా. ఎన్నో మాటలు పడ్డా.. నా సహనాన్ని తేలిగ్గా తీసుకోకండి. పవన్‌ వచ్చాకే పవర్‌ స్టార్‌ అని పిలవండి. సీఎం అయ్యాకే సీఎం అని పిలవండి. ఇప్పుడు జనసేనాని అని పిలవండి." - పవన్​కల్యాణ్​, జనసేన అధ్యక్షుడు

ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం మంచిది కాదు..

"మేము బాధ్యతగా ఉంటాం. అధికార ఎమ్మెల్యేలకు కూడా పోలీసులు, అధికారులు బాధ్యతగా ఉండాలని చెప్పాలి. ఏ కులంలో పుట్టాలో ఎంపిక చేసుకునే అవకాశం లేదు. ఎలా ప్రవర్తించాలనేది మన చేతిలో ఉంది. కులంలో చాలా గొప్పోళ్లు ఉంటారు. ఒకరు అన్నారని కులాన్ని నిందించకూడదు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం మంచిది కాదు. కులాల పేరిట కొట్లాటలతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందన్న సామెతలా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర పెత్తనమంతా కేవలం రెండిళ్లకే పరిమితం అంటే కుదరదు. ప్రజాస్వామ్యంలో అణచివేత ఏమాత్రం శ్రేయస్కరం కాదు’’ అని పవన్‌ అన్నారు." - పవన్​కల్యాణ్​, జనసేన అధ్యక్షుడు

ఇదీ చూడండి:

Last Updated : Oct 2, 2021, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.