ETV Bharat / city

ప్రభుత్వంపైనే మా పోరాటం.. పోలీసులపై కాదు: పవన్‌ - నోవాటెల్​ వద్ద భారీ బందోబస్తు

ఏపీలోని విశాఖలో జనసేన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్​ పేర్కొన్నారు. విశాఖపట్నం పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. ప్రజలకు కనీసం అభివాదం చేయకుండా ఆంక్షలు విధించారని అన్నారు. ఈ సందర్భంగా తమ పోరాటం ప్రభుత్వంపైనే కానీ.. పోలీసులపై కాదని పవన్ స్పష్టం చేశారు.

ప్రభుత్వంపైనే మా పోరాటం.. పోలీసులపై కాదు: పవన్‌

author img

By

Published : Oct 17, 2022, 6:41 PM IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం నుంచి విజయవాడ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం పోలీసు అధికారులు పవన్‌కు నోటీసులిచ్చారు. పోలీసుల ఆంక్షలతో రెండు రోజులు హోటల్లోనే ఉండిపోయిన ఆయన.. హెలికాప్టర్​లో విజయవాడకు చేరుకున్నారు. నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. విశాఖలో బయల్దేరే ముందు అరెస్టయి.. విడుదలైన పలువురితో పవన్​ మాట్లాడారు.

ఈ సందర్భంగా విశాఖలో జనసేన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని పవన్‌ కల్యాణ్​ అన్నారు. జనసేన కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టారని.. అక్రమ కేసులపై న్యాయ పోరాటానికి నిపుణులతో చర్చించినట్లు తెలిపారు. ప్రజలకు కనీసం అభివాదం చేయకుండా ఆంక్షలు విధించారని పేర్కొన్నారు. తమ పోరాటం ప్రభుత్వంపైనే కానీ పోలీసులపై కాదని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఆంక్షలు విధించకుండా న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.

  • విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు మంగళగిరి పయనమైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. pic.twitter.com/aoUxwpphO5

    — JanaSena Party (@JanaSenaParty) October 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజభవన్​కు పవన్ : పవన్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవనున్నట్లు సమాచారం. విశాఖలో జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేసే వీలుంది. ఇప్పటికే జనసేన నేతలు గవర్నర్‌ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. పవన్​కల్యాణ్​ విజయవాడ రాక నేపథ్యంలో విమానాశ్రయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు.

నోవాటెల్​ వద్ద భారీ బందోబస్తు: అంతకుముందు విశాఖలో పవన్‌ బస చేసిన నోవాటెల్‌ హోటల్‌ వద్ద పోలీసుల ఆంక్షలు కొనసాగాయి. పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హోటల్లోకి ఎవరూ వెళ్లకుండా అన్ని ద్వారాల వద్ద మోహరించారు.

ఇవీ చదవండి:

పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తెదేపా నేతల అరెస్ట్

హిందీలో మందుల చీటీ.. 'శ్రీ హరి' పేరుతో ప్రిస్క్రిప్షన్.. డాక్టర్​ వినూత్న నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.