ETV Bharat / city

'జనసేన ఆవిర్భావ సభ.. ఏపీ భవిష్యత్‌ రాజకీయాలకు వారధి' - పవన్ కల్యాణ్ తాజా వార్తలు

నేడు జరిగే జనసేన ఆవిర్భావ సభ.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర భవిష్యత్‌ రాజకీయాలకు వారధి లాంటిదని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. నేటి ఆవిర్భావ సభ వేదిక నుంచే భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. సభకు రానీయకుండా ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తే.. అక్కడకు వెళ్లడం తమ హక్కుగా చెప్పాలని పవన్​ సూచించారు.

'జనసేన ఆవిర్భావ సభ.. ఏపీ భవిష్యత్‌ రాజకీయాలకు వారధి'

author img

By

Published : Mar 14, 2022, 12:52 PM IST

ఏపీ భవిష్యత్, తెలుగు ప్రజల ఐక్యత కోసం నేడు జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటంలో జరిగే సభకు వచ్చి విజయవంతం చేయాలని శ్రేణులకు పవన్‌ పిలుపునిచ్చారు. రెండున్నరేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులపై ఈ సభా వేదికగా గళమెత్తుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ వేదిక నుంచే భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామన్నారు.

సభా ప్రాంగణానికి తాను ఎంతగానో అభిమానించే దామోదరం సంజీవయ్య పేరు పెట్టినట్లు పవన్ తెలిపారు. సభకు రానీయకుండా ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తే.. సభకు వెళ్లటం మా హక్కు అని చెప్పాలని సూచించారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లు చేసిన నాయకులను పవన్ అభినందించారు.

"భవిష్యత్ ఆశల వారధి జనసేన ఆవిర్భావ సభ. తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సభ. రెండున్నరేళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులపై గళమెత్తుతా. ఈ వేదిక నుంచే భవిష్యత్‌ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం. సభ కోసం పార్టీ శ్రేణులు 10 రోజులుగా కష్టపడ్డారు. సభ ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు." -పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత

ఇదీ చదవండి: కదులుతున్న రైలు దిగుతూ పడిపోయిన వ్యక్తి.. కాపాడిన కానిస్టేబుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.