ETV Bharat / city

ప్రారంభానికి నోచుకోని మోడల్​ మార్కెట్​ భవనం

ఎంతో ఆర్భాటంగా నిర్మించిన మోడల్‌ మార్కెట్‌ భవనాన్ని ప్రారంభించడంలో జాప్యం జరుగుతుండడం వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. భవనం నిర్మించి రెండేళ్లు పూర్తయినప్పటికీ నేటికీ ప్రారంభం కాలేదు. దీంతో ఖాళీగా ఉన్న మార్కెట్‌ భవనం అసాంఘిక శక్తులకు నిలయంగా మారుతోంది. పాటిగడ్డ మోడల్‌ మార్కెట్‌ భవనం దుస్థితికి చేరింది.

patigadda market in bad situation in hyderabad
ప్రారంభానికి నోచుకోని మోడల్​ మార్కెట్​ భవనం
author img

By

Published : Dec 24, 2020, 12:47 PM IST

గత రెండు సంవత్సరాల క్రితం దాదాపు 70 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన పాటిగడ్డ మోడల్‌ మార్కెట్‌ అందుబాటులోకి రాకపోవడం వల్ల భవన ఏర్పాటు ఉద్దేశం దెబ్బతింటోంది. భవనం నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభంలో మాత్రం ఆలస్యం జరుగుతోంది. 2018లో జీ ప్లస్‌ వన్‌ మోడల్‌ మార్కెట్‌ భవనాన్ని మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఆర్భాటంగా ప్రారంభించిన ఈ భవనంలో అద్దెల భారం, అనువైన చోటులో మార్కెట్‌ లేకపోవడం వంటి కారణాలతో.. మోడల్‌ మార్కెట్‌లోకి వచ్చేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. గతంలో రెండు దఫాలుగా టెండర్ల ద్వారా వ్యాపారులను ఆహ్వానించినప్పటికీ అద్దెలు భరించలేనివిగా ఉన్నాయంటూ వ్యాపారులు ముందుకు రాలేదు. ఆ తర్వాత అద్దెలు తగ్గించినా ఇదే పరిస్థితి. మూడోసారి టెండర్ల ద్వారా వ్యాపారులను ఆహ్వానించినా ఒక్కరు కూడా మార్కెట్‌ కాంప్లెక్స్​ భవనంలో వ్యాపారాలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. స్థానిక ప్రజలకు అవసరమయ్యే ఇతర నిత్యావసరాలను అందుబాటులో ఉంచే ఉద్దేశంతో దీనిని నిర్మించారు.

దుస్థితికి చేరిన భవనం

ఈ మార్కెట్‌లో కింది అంతస్తులో ఏడు దుకాణాలు, పైఅంతస్తులో ఎనిమిది దుకాణాలు, స్టోర్‌ గది ఏర్పాటు చేశారు. ఒక్కో దుకాణాన్ని ఒక్కో విధమైన వ్యాపారం కోసం కేటాయించాలని భావించారు. మాంసం దుకాణం, హెయిర్‌ కట్టింగ్‌ సెలూన్‌, స్టేషనరీ, వస్త్ర దుకాణం, మెడికల్‌ షాపు, ఏటీఎం, కిరాణా దుకాణం, కూరగాయల దుకాణం ఉండేలా ప్రతిపాదించారు. విభిన్న రకాల వ్యాపారులు ఒకే చోట ఉండడం వలన వినియోగదారులకు ప్రయోజనం ఉంటుందని భావించారు. అసలు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఫలితంగా ఇప్పడు ఈ భవనం దుస్థితికి చేరింది. తరచూ రాత్రివేళల్లో కొందరు మోడల్‌ మార్కెట్‌ భవనంలో మద్యం సేవిస్తున్నారు. ప్రహరీకి ఉన్న గేటు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు ఈ భవనాన్ని ఆటస్థలంగా ఉపయోగించుకుంటున్నారు. కొందరు తమ వాహనాలను కూడా ఇక్కడ పార్కింగ్‌ చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్‌ మీటర్లు కూడా ధ్వంసమయ్యాయి. తొలుత ఒక్కో దుకాణానికి తొమ్మిది వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలు అద్దె చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి టెండర్లు కూడా పిలిచారు. అయితే వ్యాపారులు ఎవరూ రాలేదు.

అద్దెలు తగ్గించాలి

ప్రస్తుతం మోడల్‌ మార్కెట్‌ భవనం అద్దెలు తగ్గిస్తే అటు స్థానికులకు, ఇటు వ్యాపారులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: తెలంగాణ ఎర్లీ కోడ‌ర్స్​కు స్కోచ్ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.