రైల్వే శాఖ టికెట్ బుకింగ్ విధానంలో అనేక మార్పులు చేసింది. టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రతి ప్రయాణికుడు కచ్చితంగా ఇంతుకుముందు కంటే అదనపు సమాచారం అందించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల ఇంటి నంబర్, వీధీ, కాలనీ, సిటీ, జిల్లా, చరవాణీ నెంబర్ వంటి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీ వైబ్‌సైట్, యాప్, రిజర్వేషన్ కౌంటర్... ఏ విధానంలో టికెట్ బుక్ చేసుకున్నా ఈ సమాచారం ఇవ్వాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. టికెట్ రద్దు చేసుకున్న వారికి పాత విధివిధానాలే కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి: హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌కు అనుమతి.. నిబంధనలివే..