హైదరాబాద్ బొల్లారంలో మిలటరీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యూవింగ్ కమాండెంట్ నారాయణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల గౌరవ వందనం నారాయణన్ స్వీకరించారు. 37వ బ్యాచ్‌లో ఉత్తీర్ణులైన 28మంది క్యాడెట్స్ ఈ పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురి ప్రత్యేకంగా అభినందించారు.
కరోనా కారణంగా తల్లిదండ్రులు రానందున... విద్యార్థులకు 'పిప్పింగ్ సెరోమనీ'ని అధికారుల చేతుల మీదుగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆర్మీ సింఫనీ బ్యాండ్ ప్రదర్శన ఆకట్టుకుంది. మిలటరీ ఇంజినీరింగ్ కళాశాలకు ఎంపికైన విద్యార్థులకు ఆర్మీ నియమ నిబంధనలకు అనుగుణంగా కఠిన శిక్షణ ఇస్తారు. మూడేళ్ల శిక్షణ పూర్తి కాగా... మరో ఏడాది పాటు ఇక్కడే శిక్షణ ఉంటుందని లెఫ్ట్‌నెంట్ జనరల్ నారాయణన్ తెలిపారు.