ఏపీ కడప జిల్లా ఖాజీపేటలో రామచిలుక ఒకటి వింతగా ప్రవర్తిస్తోంది. ఓ పురుగు మందుల దుకాణంలోని దేవతామూర్తుల చిత్రపటాల వద్దకు చేరిన రామచిలుక ఒకటి అక్కడే చక్కర్లు కొడుతోంది. గమనించిన దుకాణ యజమాని.. ఆ చిలుకను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఉదయం షాపు తెలిచిన తరువాత సుమారు ఉదయం 10.30 గంటల సమయంలో చిలుక వచ్చిందని యజమాని జంపన ఓబులరెడ్డి తెలిపారు. బయటకు పంపే ప్రయత్నం చేసినా వెళ్లకుండా చిత్రపటాల వద్దకు వచ్చిందన్నారు. రామచిలుకకు ఆహారం అందించగా.. అది ఎంచక్కా తిని అక్కడే ఉంటోందని.. ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పారు.
మొదటిసారిగా రామచిలుక ఇలా తన దుకాణంలోకి రావడం.. అక్కడే దేవుడి పటాల దగ్గర ఉండడంపై యజమాని ఓబులరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: సామూహిక పంచాంగ శ్రవణం వద్దు.. నిరాడంబరంగానే ఉగాది వేడుకలు