ETV Bharat / city

PAK vs NZ: ఇమ్రాన్‌ హామీ ఇచ్చినా పాక్‌కు షాకిచ్చిన కివీస్‌!

author img

By

Published : Sep 17, 2021, 7:39 PM IST

పాకిస్థాన్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ జట్టు.. భద్రతా కారణాల రీత్యా ఆఖరి నిమిషంలో టోర్నీని పూర్తిగా రద్దు చేసుకుంది. ఇది పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు పెద్ద షాకే అయినా ఆటగాళ్ల భద్రతే తమకు ప్రాముఖ్యమని తేల్చి చెప్పింది.

PAK vs NZ
PAK vs NZ

పాకిస్థాన్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ జట్టు ఆఖరి నిమిషంలో టోర్నీని పూర్తిగా రద్దు చేసుకుంది. భద్రతా కారణాల రీత్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆటగాళ్ల భద్రతే తమకు అన్నింటికన్నా ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్లను తిరిగి న్యూజిలాండ్‌ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ వైట్‌ వెల్లడించారు.

పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లు శుక్రవారం నుంచి మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే, ఈ రోజు మధ్యాహ్నం రావల్పిండిలో ప్రారంభమవ్వాల్సిన తొలి వన్డే నిర్ణీత సమయానికి మొదలవ్వలేదు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు హోటల్‌ గదులకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలతో ఈ పర్యటనను విరమించుకుంటున్నట్లు న్యూజిలాండ్‌ వెల్లడించింది.

ఇది పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు పెద్ద షాకే అయినా ఆటగాళ్ల భద్రతే తమకు ప్రాముఖ్యమని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ విషయంపై స్పందించిన పీసీబీ.. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని ఓ ప్రకటనలో తెలిపింది. తమ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆటగాళ్ల భద్రతపై న్యూజిలాండ్‌ ప్రధానితో మాట్లాడినా వాళ్లు ఇలా ఉన్నపళంగా టోర్నీని రద్దు చేసుకుంటున్నారని తెలిపింది. ఇప్పటికీ తాము షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించింది.

ఇదీ చూడండి: తెరపైకి కోహ్లీ-రోహిత్ విభేదాలు.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.