ETV Bharat / city

RICE CROP DAMAGE 2021 : అకాల వర్షం.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం - rain bane for rice crop in telangana

ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. ఓవైపు ప్రభుత్వాలు కొనుగోలు(paddy procurement 2021) చేస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్న అన్నదాతపై పిడుగు పడింది. అకాల వర్షం(telangana rains news).. ఆర్నెళ్ల కష్టాన్ని నీటిపాలు చేసింది. వానొస్తదని.. టార్పాలిన్లు తెచ్చేలోపే.. ఒక్కసారిగా భారీగా కురుసిన వర్షం.. వరి ధాన్యాన్ని తనతోపాటే తీసుకెళ్లింది. కర్షకున్ని మళ్లీ కష్టాల పాలు చేసింది.

RICE CROP DAMAGE 2021
RICE CROP DAMAGE 2021
author img

By

Published : Nov 20, 2021, 7:16 AM IST

మబ్బు పట్టడంతో వర్షం(telangana rains news) వస్తుందని దుకాణానికి వెళ్లి టార్పాలిన్లు తీసుకొచ్చేలోపే మొత్తం పంట తడిసిపోయిందని ఓ రైతు ఆవేదన.. దిగుబడే తక్కువ వచ్చింది... అది కూడా కొట్టుకుపోయిందని ఓ అన్నదాత ఆక్రందన... ఇలా ఏ రైతును కదిపినా వర్షంతో మా పరిస్థితి ఆగమాగమైందని వాపోతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో సుమారు 207 ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒకటి నుంచి రెండు సెం.మీ వర్షపాతం నమోదైంది.

.

ఈ వర్షాల(telangana rains news)కు విక్రయకేంద్రాల్లో, కల్లాల్లో ఉంచిన ధాన్యం(paddy crop) తడిసిపోయింది. దానిని కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలుపడ్డారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో గత వారం పదిరోజుల్లోనే ధాన్యం తడవకుండా ఉపయోగించే టార్పాలిన్లు దాదాపు రెండువేలకు పైగా అమ్ముడుపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటినే కాదు గోనె సంచులను కుట్టీ అద్దెకు ఇస్తున్నారు.ఒక్కొక్క దానికి రోజుకు రూ.15 కిరాయి వసూలు చేస్తున్నారు. ఇంత గోస ఎప్పుడూ పడలేదని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకు చెందిన బొందయ్య పేర్కొన్నారు.

‘‘ఏడు ఎకరాల్లో వరిసాగు చేస్తే దిగుబడి బాగా తగ్గి తొమ్మిది ట్రాక్టర్లే వచ్చింది. ధాన్యం ఆరబెట్టి ఎండాక ఇప్పుడు మళ్లీ తడిశాయి. ఇప్పుడు ఒక్కొక్కటి రూ.1600 పెట్టి నాలుగు టార్పాలిన్లు కొన్నా. ఆరబెట్టడం, కుప్పపోయడంతోనే సరిపోతోంది. నా టోకెన్‌ నంబరు 107, ముందు చాలా మంది ఉన్నారు. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. పంట పండించడం కంటేఅమ్ముకోవడానికే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తోంది’’ అని తెలిపారు. గోనెసంచులతో కుట్టిన వాటి అద్దెకూ రోజుకు రూ.225 చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం అనేక మంది రైతులది ఇదే పరిస్థితి.

.

కప్పేలోగా కుప్ప తడిసింది

- అనిల్‌ తోకలు, రుద్రంగి, సిరిసిల్ల జిల్లా

వర్షం(telangana rains news) వస్తుందని కప్పడానికి టార్పాలిన్‌ షీట్లు కొనుక్కొచ్చేలోగా నష్టం జరిగిపోయింది. నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తే 70 క్వింటాళ్లు వచ్చింది. ధాన్యం సొసైటీ కేంద్రానికి తెచ్చి 15 రోజులు అయ్యింది. తేమ 20 శాతం ఉంది. రోజూ ఆరబెట్టడం, కుప్పపోయడం చేస్తున్నాం. సొసైటీ దగ్గర భూమి చదునుగా లేదు. దీంతో వర్షం వచ్చి వడ్లు కొట్టుకుపోయాయి. పక్కనే ఉన్న మార్కెట్‌ కేంద్రంలో టార్పాలిన్లు ఉన్నా సొసైటీ వాళ్లు తేలేదు. రూ.ఆరువేలు అప్పు తెచ్చి రెండు టార్పాలిన్లు కొనుక్కొచ్చా. నేనే కాదు, 30 మందికి పైగా రైతులు ఇలా కొనుక్కొచ్చారు. కొనుగోలు కేంద్రాలను పొలాల్లో పెట్టడం కూడా సమస్యగా మారింది.

రూ. ఆరువేలు పెట్టి టార్పాలిన్లు కొన్నా..

-తూము నరసయ్య, పత్తికుంటపల్లి, గంగాధర మండలం, కరీంనగర్‌ జిల్లా

అసలే దిగుబడి తక్కువవచ్చిందని బాధపడుతుంటే, వర్షానికి ధాన్యం తడిసి మరింత నష్టపోవాల్సి వచ్చింది. నాలుగు ఎకరాల్లో వరిసాగు చేస్తే ఐదు ట్రాక్టర్ల దిగుబడి వచ్చింది. మధురానగర్‌ కేంద్రానికి తెచ్చి 15 రోజులైంది. తేమశాతం 15 వరకు రావాలని తూకం వేయలేదు.ఈలోగా వర్షం వచ్చి తడిసింది. మొక్కలు మొలిచి అంతా ఆగమాగమైంది. ఆరబెట్టుకొన్నా. మళ్లీ వర్షం రావడంతో రక్షించుకొనేందుకు రూ.ఆరువేలు పెట్టి టార్పాలిన్లు కొనుక్కొస్తున్నా. వడ్లు అమ్మాక ఇస్తామని దుకాణంలో అప్పు పెట్టి తెచ్చా.

పండిందే తక్కువ.. అదీ తడిసింది

-తూళ్ల చంద్రశేఖర్‌, మధురానగర్‌, గంగాధర మండలం, కరీంనగర్‌ జిల్లా

రెండెకరాల్లో వరి సాగు(rice crop cultivation) చేస్తే దిగుబడి తక్కువ వచ్చింది. అది కూడా మొత్తం తడిసిపోయింది. పంటను పండించి ధాన్యాన్ని కేంద్రానికి తేవడం వరకు అయిన ఖర్చుకు అదనంగా ఇప్పుడు రక్షించుకోవడానికి పెట్టాల్సి వస్తోంది. రూ.5400 పెట్టి రెండు టార్పాలిన్లు కొన్నా. తేమ తగలకుండా కింద షీటు వేశాం.పైన వేసినా నీళ్లు నిలిచాయి.తేమ శాతం ఎక్కువ ఉందని కొనడం లేదు. రోజూ ఆరబెడుతున్నా. మరో పక్క మబ్బులు, వర్షంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు.

20 రోజులుగా నిరీక్షిస్తున్నాం

-వేముల రాజమల్లు, కాసులపల్లి, పెద్దపల్లి మండలం

20 రోజుల కిందట పెద్దపల్లి మార్కెట్‌ యార్డుకు 800 బస్తాల ధాన్యాన్ని(paddy procurement 2021) తీసుకొచ్చాను. ఇప్పటివరకు 400 బస్తాలు మాత్రమే తూకం వేశారు. మిగిలిన ధాన్యంలో తేమ, తాలు ఉందని చెబుతూ ఆలస్యం చేస్తున్నారు. ధాన్యం తీసుకొచ్చిన నాటి నుంచి ఇక్కడే నిరీక్షిస్తున్నాం. కుటుంబం మొత్తం ధాన్యానికి కాపలాగా ఉంటున్నాం. ఇప్పటివరకు 2 సార్లు వర్షం పడి ధాన్యం తడిసిపోయింది. నిత్యం ఆరబెట్టడం, కుప్పవేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగిరం చేయాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.