ETV Bharat / city

పన్నుల ఆదాయంతో రాష్ట్రం ముందుకు.. లక్ష్యంలో 40 శాతం వసూలు - తెలంగాణ వార్తలు

Own Revenue in Telangana: 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాబడి అంచనాలను అందుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొంతమేరకు సఫలీకృతం అవుతున్నాయి. మొదటి ఆరు నెలల్లో సొంత రాబడులు 75 శాతం వసూలయ్యాయి. రుణాలపై కేంద్రం ఆంక్షల నేపథ్యంలో సొంత రాబడులను పెంచుకునే దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది. బాండ్ల విక్రయం ద్వారా రూ.20 వేల కోట్ల రుణాన్ని రాష్ట్రం సమీకరించుకుంది.

telangana revenue
తెలంగాణ ఆదాయం
author img

By

Published : Oct 15, 2022, 9:51 PM IST

Own Revenue in Telangana: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో రాబడి అంచనాలను అందుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొంతమేరకు సఫలీకృతం అవుతున్నాయి. రుణాలపై కేంద్రం ఆంక్షల నేపథ్యంలో సొంత రాబడులను పెంచుకునే దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సొంత రాబడులు 75 శాతం దాకా ఉండగా గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ అంచనాల్లో రాబడి పదిశాతం వరకే పరిమితమైంది.

ఈ ఆరు నెలల్లో వాణిజ్య పన్నులశాఖ రాబడుల్లో 15 శాతం వృద్ధిరేటు నమోదైంది. అమ్మకం పన్ను, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌ రాబడి అండగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రధానంగా పన్నేతర రాబడి అంచనాల్లో సుమారు 30 శాతానికి చేరుకోవడం ఊరట ఇచ్చే అంశంగా ఉంది. సొంత రాబడుల అంచనాల్లో సుమారు 40 శాతం వచ్చాయి. సెప్టెంబరు ఆఖరు వరకూ రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం జీఎస్టీ ద్వారా రాగా తర్వాతి స్థానంలో అమ్మకం పన్ను, మద్యంపై ఎక్సైజ్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల రాబడి, పన్నేతర రాబడి ఉన్నాయి. ప్రధానంగా పెట్రోలు, మద్యం అమ్మకం పన్నుతో పాటు వస్తు సేవల పన్నులు ఖజానాకు అండగా నిలిచాయి. పన్నుల రాబడిని రూ.1.26 లక్షల కోట్లుగా అంచనావేయగా 90%మేరకు లక్ష్యం చేరుకునేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే రూ.50 వేలకోట్ల దాకా రావడంతో మిగిలిన ఆరు నెలల్లో కనీసం రూ.60 వేలకోట్లు వస్తాయని భావిస్తున్నారు. సుమారు రూ.25 వేల కోట్ల పన్నేతర రాబడిని అంచనా వేయగా ఇప్పటివరకు మూడోవంతుదాకా సమకూరింది.

భూముల అమ్మకం: భూముల అమ్మకం ద్వారా పన్నేతర రాబడిని సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఇప్పటికే రూ.8 వేలకోట్లకు పైగా పన్నేతర రాబడి రాగా రానున్న రెండు నెలల్లో కనీసం మరో రూ.3 వేల కోట్లను సమకూర్చుకునేలా హెచ్‌ఎండీఏ ద్వారా భూముల వేలానికి ప్రయత్నిస్తోంది. వాణిజ్య పన్నులశాఖ మొండి బకాయిల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల మేరకు అంచనాలు వేయగా ఇప్పటికి సుమారు రూ.300 కోట్లు వసూలయ్యాయి. మిగిలిన మొత్తంపై కసరత్తు చేస్తోంది. రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా సుమారు రూ.7 వేల కోట్లు సమకూరాయి. వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా రాబడి ఆరు వేలకోట్లకు పైగా ఉండగా మిగిలిన మొత్తం రిజిస్ట్రేషన్‌ శాఖకు ఇతర రూపాల్లో అందింది.

బాండ్ల విక్రయంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బాండ్ల విక్రయం ద్వారా రూ.52,227 కోట్లను సమకూర్చుకోవాలని ప్రతిపాదించగా కేంద్ర ఆర్థిక శాఖ మార్పుల నేపథ్యంలో రూ.40 వేలకోట్లలోపే అందనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు ఆఖరు వరకు బాండ్ల విక్రయం ద్వారా రూ.20 వేల కోట్ల రుణాన్ని రాష్ట్రం సమీకరించుకుంది. కేంద్ర పన్నుల వాటా అంచనాల్లో 40 శాతంలోపే.. రూ.5000 కోట్లు మాత్రం అందింది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అంచనాల్లో అందిన మొత్తం 15 శాతంలోపే ఉంది. రూ.41 వేలకోట్లు అంచనా వేయగా కేవలం 5 వేల కోట్ల రూపాయల లోపే అందింది. వాణిజ్య పన్నులశాఖ ద్వారా రూ.34,615 కోట్లు సమకూరాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.15 వేల కోట్లు అంచనా వేయగా ఇప్పటికి రూ.7 వేలకోట్లు ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్ల రాబడి అంచనాల మేరకే ఉంటుందని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది.

5 నెలల్లో ఇదీ వ్యయం: ఆగస్టు వరకు రాబడులు, వ్యయాలను ఆర్థికశాఖ విశ్లేషించింది. వేతనాలు, పింఛన్లు, సబ్సిడీలు, వడ్డీల చెల్లింపుల రూపంలో మొదటి అయిదు నెలల్లో రూ.72,625 కోట్లు వ్యయం అయినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. రెవెన్యూ ఖాతా వ్యయం రూ.30,686 కోట్లు కాగా వడ్డీల చెల్లింపు, వేతనాలు, పింఛన్లు, సబ్సిడీల రూపంలో రూ.30,686 కోట్లు, పెట్టుబడి వ్యయం ఆరు వేలకోట్లని పేర్కొంది. మొదటి అయిదు నెలల్లో వ్యయం అంచనాల్లో 33 శాతం అయినట్లు పేర్కొంది. ఇది గత ఏడాదికంటే మూడు శాతం ఎక్కువని విశ్లేషించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.