ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఐ.ఎఫ్.టి.యు అనుబంధ సంస్థ ప్రోగ్రెసివ్ కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఓయూ కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని యూనియన్ అధ్యక్షురాలు ఎస్.ఎల్ పద్మ డిమాండ్ చేశారు. సత్వరమే రవాణా వ్యవస్థను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవీ చూడండి: "సినిమా 10నిమిషాలు లేటైంది.. తరువాత ఏమైందంటే..."