ETV Bharat / city

Shops Close For CM Tour: తణుకులో జగన్​ పర్యటన.. దుకాణాలు మూసేయాలని ఆదేశాలు

Shops should close on CM Tour: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. సీఎం పర్యటన సమయంలో పట్టణంలోని దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Shops Close For CM Tour: తణుకులో జగన్​ పర్యటన.. దుకాణాలు మూసేయాలని ఆదేశాలు
Shops Close For CM Tour: తణుకులో జగన్​ పర్యటన.. దుకాణాలు మూసేయాలని ఆదేశాలు
author img

By

Published : Dec 18, 2021, 8:24 PM IST

Shops should close on CM Tour: ఈనెల 21న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో పర్యటించనున్నారు. మహిళా కళాశాల ఎదురుగా వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​లో హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి ఆయన బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే సభకు చేరుకుంటారు. మార్గమధ్యలో జగన్ పర్యటనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇనుపరాడ్లతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ సీఎంకు అడ్డుపడకుండా చర్యలు చేపట్టారు.

పర్యటన ముందస్తు చర్యల్లో భాగంగా 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పట్టణంలోని అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తణుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తమ పరిధిలోని వ్యాపార వాణిజ్య సంస్థలకు నోటీసు ద్వారా సమాచారం అందించింది. గతంలో ఏ ముఖ్యమంత్రికి లేనివిధంగా పూర్తిస్థాయి భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.