విపక్ష నేతలు రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలు.. ప్రజలు పడుతున్న ఇక్కట్లను వివరించారు. ఒకప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయనని బల్లగుద్ది చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు దానిపై దృష్టి పెట్టారని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ వ్యాఖ్యానించారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. రాజకీయ వ్యాఖ్యలు చేసిన ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మపై చర్యలు తీసుకోవలని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వీరితో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ మంత్రి గీతా రెడ్డి, భాజపా నేత మోహన్ రెడ్డి తదితరులు ఆర్టీసీ సమస్యను గవర్నర్కు వివరించారు. అవసరం అయితే కార్మికుల సమస్యను రాష్ట్రపతి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని విపక్ష నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు