Training centers in universities: రాష్ట్రంలో ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలను ఈనెల 20వ తేదీన ప్రారంభించనున్నారు. 80 వేలకుపైగా ప్రభుత్వ కొలువులను భర్తీ చేయనున్న నేపథ్యంలో వర్సిటీల్లో చదువుకునే యువత బయట కోచింగ్ కేంద్రాల బాట పట్టకుండా చదువుకునే ప్రాంగణంలోనే శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలకు కూడా నిధులు విడుదల చేసింది.
ఓయూలో సివిల్ సర్వీసెస్ అకాడమీ పేరిట శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ విధానంలో ఒకేసారి ఆరు వర్సిటీల్లో శిక్షణ కేంద్రాలను ప్రారంభించనున్నారు. నిపుణులు దేశంలో ఎక్కడ ఉన్నా అక్కడి నుంచి ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇచ్చేలా ఓయూలో ఏర్పాట్లు చేయాలని ఆ వర్సిటీ ఉపకులపతి రవీందర్‌కి ఛైర్మన్ లింబాద్రి సూచించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి:JOB NOTIFICATIONS: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. త్వరలోనే నోటిఫికేషన్లు..!