ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో సీఆర్డీఏలో పని చేస్తున్న ఓ పొరుగు సేవల ఉద్యోగిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నెక్కళ్లులోని సీఆర్డీఏ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న రణధీర్‌ను విజయవాడలోని ఆయన నివాసం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.మాధురి వద్ద రణధీర్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేశారు. ఆయన గత నాలుగు నెలలుగా దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు.
భూ సమీకరణ పథకంలో తనది కాని భూమిని తనదిగా పేర్కొంటూ తుళ్లూరు మండలం నెక్కళ్లు గ్రామానికి చెందిన గోపాలకృష్ణ తప్పుడు పత్రాలు సమర్పించి...అక్రమంగా ప్లాట్లు పొందారనే ఆరోపణపై సిట్ గతంలో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో ఆయనకు సహకరించారనే అభియోగంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. మాధురిని ఇటీవలే అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినవారికి సంఖ్య మూడుకు చేరింది.
ఇవీ చూడండి: 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్