బీమా వైద్య సేవల కుంభకోణంలో అనిశా అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఒమ్ని మెడి మార్కెటింగ్ మేనేజర్ నాగరాజును అనిశా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 'లెజెండ్' అనే డొల్ల కంపెనీ ఏర్పాటు చేసి దాని ద్వారా రక్తపరీక్షలకు సంబంధించిన కిట్లను సరఫరా చేసినట్లు నకిలీ ఇండెంట్లు సృష్టించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ కుంభకోణంలో ఒమ్ని మెడీ ఎండీ శ్రీహరి, లెజెండ్ ఎండీ కృపాసాగర్కు నాగరాజు సహాయ సహకారాలు అందించారు. ఈఎస్ఐ అధికారులను ప్రలోభపెట్టి, డబ్బులు ఆశచూపి కుంభకోణానికి సహకరించాల్సిందిగా నాగరాజు చేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో అనిశా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈఎస్ఐ ఔషధాల కుంభకోణంలో మరొకరు అరెస్టు - Telangana Esi Scam today news
18:20 January 04