ETV Bharat / city

బైక్​ అదుపుతప్పి కింద పడిపోయాడు.. పైకి లేస్తుండగా..! - బైక్​ అదుపుతప్పి కింద పడిపోయాడు.. పైకి లేస్తుండగా..!

బైక్​ అదుపుతప్పి కింద పడిపోయాడు.. పైకి లేస్తుండగా..!

author img

By

Published : Mar 26, 2022, 12:20 PM IST

12:15 March 26

బైక్​ అదుపుతప్పి కింద పడిపోయాడు.. పైకి లేస్తుండగా..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్​ అదుపుతప్పి కింద పడిపోయిన ఓ విద్యార్థి తల పైనుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సాయిచరణ్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు.

కొత్తగూడెం పట్టణానికి చెందిన నర్సింహా అనే వ్యక్తి స్థానిక మున్సిపాలిటీలో పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయిచరణ్ లక్ష్మీదేవిపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే కళాశాలకు వెళ్లిన సాయిచరణ్.. మధ్యాహ్నం మరో విద్యార్థి బైక్​పై ఇంటికి బయలుదేరాడు. స్థానిక వ్యవసాయ మార్కెట్​ వద్ద యూటర్న్​ తీసుకుంటుండగా.. బైక్​ అదుపుతప్పింది. దీంతో వాహనంపై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. పైకి లేస్తున్న క్రమంలో భద్రాచలం నుంచి కొత్తగూడెం వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సాయిచరణ్​ తల పైనుంచి దూసుకెళ్లింది. బైక్​ నడుపుతున్న సాయిచరణ్​ శిరస్త్రాణం ధరించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న సాయిచరణ్​ తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్‌ అతివేగం, అజాగ్రత్త వల్లే తమ కుమారుడి ప్రాణాలు పోయాయంటూ ఆందోళనకు దిగారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: Student Suicide in Chittoor : అధికార పార్టీ నేత కూతురి కోసం.. చదువుల తల్లిని చంపేశారా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.