టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించిన యువ సంచలనం నీరజ్ చోప్రాకు హరియాణా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. చోప్రాకు 6 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. అంతేకాక క్లాస్ వన్ కేటగిరీలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. మిగతా ఆటగాళ్లలాగానే.. 50శాతం రాయితీతో ఓ ఫ్లాట్ అందిస్తామన్నారు. చోప్రా కోరితే.. పంచకుల ప్రాంతంలో అథ్లెట్స్ కోసం ఓ స్టేడియంను కూడా నిర్మిస్తామన్నారు.
ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 120 ఏళ్లుగా నిరీక్షించిన భారత్ కల ఫలించింది. జావెలిన్ త్రో ఫైనల్లో గెలిచిన యువ సంచలనం నీరజ్ చోప్రా మువ్వన్నెల పతాకానికి పసిడి కాంతులద్దాడు.
23 ఏళ్ల ఈ కుర్రాడు ఎన్నో ఆశలు.. అంచనాలతో టోక్యోకు వెళ్లి స్వర్ణం గెలిచి భారత్ గర్వించేలా చేశాడు.
ఇదీ చూడండి : వందేళ్ల భారత నిరీక్షణకు తెర