ETV Bharat / city

పెన్నానదిలో బయటపడ్డ చోళుల కాలం నాటి ఆలయం..! - nellore district latest news

వందల సంవత్సరాల కిందట చోళుల కాలంలో పరశురాముడు స్థాపించిన గుడి ఎట్టకేలకు బయటపడింది. పెన్నా నది ఒడ్డున చోళుల కాలం నాడు స్థాపించిన గుడి, శిలలను పురావస్తు శాఖ అనుమతితో మరోచోట ప్రతిష్టించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు స్థానిక యువత కృషి చేస్తున్నారు.

old-temple-in-penna-river-at-chejerla-mandal in ap
పెన్నానదిలో బయటపడ్డ చోళుల కాలం నాటి ఆలయం..!
author img

By

Published : Jun 16, 2020, 11:06 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లుపాడు గ్రామ సమీపంలోని పెన్నా నది ఒడ్డున ఉన్న వందల ఏళ్ల నాటి నాగేశ్వరస్వామి దేవాలయం… వరదల కారణంగా ఇసుకమేట వేసి పూర్తిగా నదిలో కూరుకుపోయింది. గ్రామస్థులు తవ్వకాలు జరిపి దేవాలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇటీవల ఇసుక మేట వేసిన ప్రాంతం వరకు ఇసుక రీచ్ కొరకు మెటల్ రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల ఆ ప్రాంతం వరకు రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఇసుక మేటలో కూరుకుపోయి ఉన్న తమ గ్రామానికి చెందిన పురాతన దేవాలయాన్ని వెలికితీసి… అందులో ఉన్న మూలవిరాట్టు కోసం మరో గుడి నిర్మించుకోవాలని గ్రామస్థులు భావించారు.

గ్రామస్థులందరూ ఓ మాట అనుకొని ఇసుక రీచ్ వారి సహాయంతో దేవాలయాన్ని వెతికే పని మొదలుపెట్టారు. మంగళవారం దేవాలయం గోపురం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గ్రామస్థులు దేవాదాయ శాఖకు, స్థానిక అధికారులకు తెలిపారు.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… 300 ఏళ్ల కిందటి నాగేశ్వరస్వామిగా శివాలయం, గ్రామం ఈ ప్రాంతంలో ఉండేవి. ఇసుకమేట ఎక్కువగా ఉండడం వల్ల 50 ఏళ్ల కిందట గ్రామం ఖాళీ చేసి సమీపంలో పెరుమాళ్ళుపాడు నిర్మించుకున్నామని వివరించారు.

ఈ దేవాలయానికి సుమారు రెండు వందల ఎకరాల మాన్యాలు ఉన్నట్టు సమాచారం. అధికారులు వచ్చి పరిశీలించిన అనంతరం… తమ గ్రామ సమీపంలో కట్టుకుంటామని తెలిపారు. తవ్వకాల్లో గోపురం బయటికి వచ్చిన విషయం తెలిసి… దాన్ని చూసేందుకు భారీగా జనం అక్కడికి చేరుకున్నారు. కొందరు మహిళలు దేవాలయం వద్ద పూజలు చేశారు.

ఇవీ చూడండి: వెలవెలబోతున్న తిరుపతి నగరం... ఉపాధి కోల్పోయిన వ్యాపారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.