ETV Bharat / city

Oil Prices Increases : ఉక్రెయిన్​లో బాంబుల మోతలు... హైదరాబాద్​లో ఆయిల్​ మంటలు - విజయ ఆయిల్​ అవుట్​లెట్​ వద్ద రద్దీ

Oil Prices Increase : రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం వంటనూనెలపై పడింది. ముఖ్యంగా సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరుగుతాయన్న నేపథ్యంలో ప్రజలు నూనె విక్రయ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.

Oil Price Increase
Oil Price Increase
author img

By

Published : Feb 25, 2022, 4:37 PM IST

Oil Prices Increase : రష్యా, ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో వంట నూనె ధరలు పెరుగుతాయని వార్తలు రావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయిల్​ కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్​ ఆర్టీసీ క్రాస్​రోడ్ పరిసరాల్లోని విజయ ఆయిల్ స్టోర్ అవుట్ లెట్ వద్ద ఉదయం నుంచి వినియోగాదురులు బారులు తీరారు. ఇతర రోజులతో పోలిస్తే గురువారం దాదాపు రెండు లక్షల రూపాయలు అదనంగా మార్కెట్ జరిగినట్టు అమ్మకం దారులు చెబుతున్నారు.

ఈ రోజు ఉదయం 8 గంటల నుంచే వినియోగదారులు ఔట్ లెట్ వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు చేయడంతో స్టాక్ కూడా క్రమంగా తగ్గుతోందని స్టోర్​ నిర్వాహకులు వివరించారు.

Oil Price Increase
విజయ ఆయిల్​ అవుట్​లెట్​ వద్ద బారులు తీరిన వినియోగదారులు

రోజువారి ఖాతాదారులతో పాటు నిన్న భారీగా అమ్మకాలు జరిగాయి. రష్యా, ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో వంట నూనె ధరలు భారీగా పెరుగుతాయనే వార్తలు రావడంతో పెద్ద ఎత్తున వంట నూనె కొనుగోలు చేస్తున్నారు. ఉదయం నుంచే స్టోర్​ వద్ద క్యూ కట్టారు. రోజువారి అమ్మకాలం కంటే నిన్న ఒక్కరోజే రూ.2లక్షలు అదనంగా అమ్మకాలు జరిగాయి. -ప్రవీణ్ , విజయ ఆయిల్ అవుట్ లెట్ ఉద్యోగి

గత నెల నుంచి ఈ నెల వరకు రూ.20పెరిగింది. అయితే ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో నూనె ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధం ముగిసిన తర్వాత మరళా ధరలు తగ్గొచ్చు. మేము కొనుగోలు చేసేందుకు కూడా మాకు కూడా లభించడం లేదు. -సునీత, మార్కెటింగ్ డిప్యుటీ మేనేజర్ , విజయ ఆయిల్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఔట్ లెట్

ఇదీ చూడండి : రష్యా-ఉక్రెయిన్​ యుద్ధంతో గ్యాస్ ధరకు రెక్కలు- వాటికి తీవ్ర కొరత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.