ETV Bharat / city

రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలి: కేసీఆర్‌

author img

By

Published : Dec 7, 2020, 10:29 PM IST

రాష్ట్రంలో 25 జిల్లాలను ఆయిల్ పామ్ సాగుకు అనువైనవిగా కేంద్రం గుర్తించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపుపై సీఎం కేసీఆర్ సమీక్షించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. రూ.4,800 కోట్లతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు.

kcr
kcr

రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించారు. రూ.4,800 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టనున్న ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును సీఎం ఆమోదించారు. రైతులకు యాభై శాతం రాయతీతో ఆయిల్ పామ్ సాగు చేయించనున్నట్లు తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులతో ప్రగతిభవన్​లో సమావేశమైన సీఎం... రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుపై సమీక్షించారు.

ఆ నీటితో నాలుగు ఎకరాల్లో సాగు

నిత్యం సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్ పామ్ సాగు చేయడం సాధ్యమవుతుంది. రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరంతర విద్యుత్ సదుపాయాన్ని రైతాంగం ఉపయోగించుకోవాలి. రాష్ట్రంలోని 25 జిల్లాలను ఆయిల్ పామ్ సాగుకు అనువైనవిగా కేంద్ర ప్రభుత్వ బృందం గుర్తించింది. ఒక ఎకరా వరిని సాగు చేసే నీటితో నాలుగు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు. వరిధాన్యం నిల్వలు అసవరానికి మించి ఉన్నందున ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేయడం మేలు. ఏటా 15 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నందున రూ.70 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది.

-కేసీఆర్, సీఎం

ఈ జిల్లాలు అనువైనవి

ప్రస్తుతం దేశంలో ఎనిమిది లక్షల ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు అవుతోందని... ఇంకా లక్షలాది ఎకరాల్లో విస్తరించాల్సిన అవసరం, అవకాశం ఉందని సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కేవలం 38 వేల ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు అవుతోందని తెలిపారు. నిర్మల్, మహబూబాబాద్, కామారెడ్డి, వరంగల్ రూరల్, నిజామాబాద్, సిద్దిపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, సూర్యాపేట, ములుగు, నల్గొండ, జనగామ, వరంగల్ అర్బన్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్ నగర్, కొత్తగూడెం జిల్లాల్లో 8,14,270 ఎకరాల్లో ఆయల్ పామ్ సాగు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఆ బెడద ఉండదు

ఆయిల్ పామ్​లో మూడేళ్ల పాటు అంతర పంట వేసుకోవచ్చని, నాలుగో ఏడాది నుంచి పంట వస్తుందని కేసీఆర్​ అన్నారు. ఒక్కసారి నాటిన మొక్క వల్ల 30 ఏళ్ల పాటు పంట వస్తుందని చెప్పారు. మొదటి నాలుగేళ్లు ఒక్కో ఎకరానికి 60 వేల వరకు ఖర్చు వస్తుందని... ఇందులో యాభై శాతం ప్రభుత్వ రాయతీ ఉంటుందని సీఎం తెలిపారు. ఎకరానికి రైతుకు ఏడాదికి నికరంగా లక్ష రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. ఆయిల్ పామ్ పంటకు కోతులు, అడవి పందుల, రాళ్లవాన, గాలివాన బెడద ఉండదని... రైతులకు విధిగా మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేసే విధానం చట్టంలోనే పొందు పరిచారని వివరించారు.

ఏటా ధర పెరుగుతుంది

ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.12,800 ఉందని... ఏటా పెరుగుతుందే తప్ప తగ్గదని అన్నారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్​తో పాటు 14 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ సొంత ఖర్చులతో నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టబోతున్నాయని అన్నారు.

ఇదీ ​చదవండి : తెలంగాణ పత్తికి అంతర్జాతీయ బ్రాండ్‌ ఇమేజ్ తీసుకురావాలి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.