విశాఖ జిల్లా సబ్బవరంలో కరోనా బాధితుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించారు. కరోనా సోకిన వారిని కరోనా కేంద్రాలకు తరలించడంలోనూ జాప్యం చేస్తున్నారు. తాజాగా సబ్బవరం ప్రాథమిక ఆస్పత్రిలో గర్భిణీకి కరోనా సోకిందని తెలింది. ఆమెను కరోనా కేంద్రానికి తరలించడంలోనూ అధికారులు నిర్లక్ష్యం వహించారు.
కరోనా సోకినట్లు తెలిసి గంటలు గడిచినా.. ఐసోలేషన్ కేంద్రానికి తీసుకువెళ్లలేదు. వాహనం లేదని కారణం చెప్పారు. చివరికి కుటుంబ సభ్యులు పలు సార్లు ఫోన్లు చేసి మాట్లాడగా.. విశాఖ ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ఇవీచూడండి: ప్లాస్మా ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలి: సజ్జనార్