ETV Bharat / city

సినిమా చూపించలేం మావా..! ఆందోళనలో ఏపీ ఎగ్జిబిటర్లు.. అసలేం జరుగుతోంది..? - raids on movie theaters in andhrapradesh

Raids on movie theaters in AP: వకీల్​సాబ్​తో ఎంట్రీ ఇచ్చారు.. అఖండతో.. అక్కడక్కడా తనిఖీలు చేపట్టారు.. గత మూడు రోజులుగా ఏకంగా స్పీడ్ పెంచేశారు..! ఇది ప్రస్తుతం ఏపీలో సినిమా థియేటర్లపై దాడులు జరుగుతున్న పరిస్థితి! బెజవాడ, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, ఏలూరు, కర్నూలు, కడప, విశాఖ.. ఇలా ఏ సెంటర్​కెళ్లినా.. సినిమా థియేటర్లలో తనిఖీలు అనే మాటే వినిపిస్తోంది..! ఈ పరిణామాలు రోజురోజుకూ కీలక మలుపు తిరుగుతున్నాయి. తాజాగా హీరో నాని వ్యాఖ్యలు చేయటం.. వెంటనే నిర్మాత నట్టి కుమార్ కౌంటర్ వేయడం చకచకగా జరిగిపోయాయి. ఇక్కడివరకు ఇలా ఉంటే... మంత్రి అనిల్ కామెంట్స్ మరింత హీట్​ను పెంచేశాయి! ఇందుకు ప్రతిగా హీరో సిద్ధార్థ్..ట్వీట్ చేశాడు.​ అసలు ఏపీలో సినిమా థియేటర్లపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి..? ఎగ్జిబిటర్ల మాటేంటి..? ఏపీ ప్రభుత్వం ఏం చెబుతోంది..! ఈ పరిస్థితుల్లో ఏపీలో సినిమా థియేటర్లపై దాడుల అంశం వెనుక ఏం జరుగుతోందనే చర్చ సాగుతోంది.

movie tickets issue
movie tickets issue
author img

By

Published : Dec 25, 2021, 2:31 AM IST

Raids on movie theaters in AP: ఏపీలో సినిమా థియేటర్లపై దాడులు హాట్​ టాపిక్​గా మారాయి. గడిచిన కొద్దిరోజులుగా అక్కడక్కడ దాడులు జరిగితే.. 3 రోజుల్లో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంది. దాదాపు ఏ సెంటర్​లో చూసినా.. తనిఖీల అంశం థియేటర్​ యజమానులను బెంబేలెత్తిస్తోంది! ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేసేస్తున్నారు అధికారులు..! జేసీల ఆధ్వర్యంలో సాగుతున్న ఈ తనిఖీల్లో రెవెన్యూ, పోలీసులతో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొంటున్నారు. ప్రతి అంశాన్ని సిరీయస్​గానే పరిగణిస్తున్నారు. కొన్ని థియేటర్లను ఏకంగా సీజ్ చేసేశారు..! ఈ పరిణామాలపై ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల అయితే.. స్వయంగా యజమాన్యాలే థియేటర్లను మూసివేసే చిత్రాలు దర్శనమిస్తున్నాయి..! మరోవైపు తాజా పరిణామాలపై హీరో నాని..చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నాని కామెంట్స్​పై ఏపీ మంత్రులు ఘాటుగానే స్పందించారు. హీరో సిద్ధార్థ్ కూడా పలు కామెంట్స్ చేశాడు.

థియేటర్లపై దాడులు.. కారణాలు..!
సినిమా థియేటర్లపై దాడులకు ఈ ఒక్క కారణమనే చెప్పలేం. థియేటర్లలో జీవో నెంబర్ 35 ప్రకారం టికెట్ రేట్లు, ఆన్ లైన్ టికెట్ల విధానం అమలు, సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, క్యాంటీన్లలో ధరలు, వెహికల్ పార్కింగ్, పరిశుభ్రత వంటి అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. తనిఖీల్లో భాగంగా.. ఫైన్లు విధిస్తున్నారు. తీవ్రతను బట్టి... సీజ్​ చేసేస్తున్నారు..! మరికొన్నిచోట్ల నోటీసులతో సరిపెట్టేస్తున్నారు..! లైసెన్స్ లేకపోయినా, నిబంధనలు పాటించకపోయినా తగ్గేదేలే అన్న పరిస్థితి నెలకొంది. ఏపీలోని ప్రధాన సెంటర్లలోని ఏదో ఒక థియేటరపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఈ సంఖ్య వందల్లోనే ఉంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే సీజ్ చేసిన థియేటర్ల సంఖ్య చూస్తే 14కి పైగా ఉంది. విజయనగరంలో 6, కర్నూలు జిల్లాలో ఒక థియేటర్​ను మూసివేశారు. చిత్తూరు జిల్లాలోని పదుల సంఖ్యలో థియేటర్ల గేట్లకు తాళాలు పడ్డాయి.

ఎగ్జిబిటర్ల ఆందోళన.. స్వయంగా మూసివేత!
Exhibitors closed theatres in AP: థియేటర్లపై వరుస దాడులతో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా కారణంగా సినిమా రంగం తీవ్ర నష్టాల్లో ఉందంటున్నారు. థియేటర్ల పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఈ ఏడాది జూలై నుంచి థియేటర్ల సగం సామర్థ్యంతో టికెట్లు అమ్ముకోవచ్చని సర్కార్ అనుమతి ఇవ్వటం ఎగ్జిబిటర్లకు ఉపశమనం ఇచ్చింది. అంతలోనే ఈ దాడులు ప్రారంభం కావటంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైందని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు.

పలుచోట్ల ప్రస్తుత ప్రభుత్వ ధరల ప్రకారం థియేటర్​ను నడపలేమంటూ.. స్వయంగా మూసివేస్తున్నాయి యజమాన్యాలు. విశాఖ జిల్లాలోని అగ్రహారంలో బాలత్రిపుర సుందరి థియేటర్ యజమాన్యం .. ఈ కారణంతోనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీల పరిధిలో నడిచే థియేటర్ల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది. కొవిడ్‌ నుంచి బయటపడే తరుణంలో సర్కారు టికెట్ల ధరలు తగ్గించేయడంతో ఆర్థిక భారాన్ని మోయలేక... తూర్పుగోదావరి జిల్లాలో 45 మంది యజమానులు గురువారం థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ, కృష్ణా జిల్లా నందిగామ, మైలవరం, పెనుగంచిప్రోలు, శ్రీకాకుళం జిల్లా కొత్తూర్లలో తమ థియేటర్లకు యజమానులే స్వయంగా తాళాలు వేసుకున్నారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరం గ్రామీణంలోని నామవరం, ధవళేశ్వరం... కాకినాడ గ్రామీణంలోని వాకలపూడి, జగ్గంపేట, రావులపాలెం, గోకవరం, అమలాపురం, రాయవరం, మలికిపురం, సీతానగరం, రాజోలు, కోరుకొండ, ఉప్పాడ, ముమ్మిడివరం, గొల్లప్రోలు తదితరచోట్ల సినిమా హాళ్లను యజమానులు మూసేస్తున్నారు.

యజమానులు చెబుతున్న కొన్ని ఇబ్బందులు ఇవే..!

  1. ఏపీలో సుమారు వెయ్యికి పైగా థియేటర్లు ఉన్నాయి. ఒక్కో థియేటర్ యాజమాన్యం.. ప్రేక్షకుల సామర్థ్యం ప్రకారం నిర్వహణ ఖర్చుల కింద రూ. 3 నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చిస్తున్నామని చెబుతోంది.
  2. ఒక్కో థియేటర్​కు సగటున 50 మంది ఉపాధి పొందుతున్నారు.
  3. కొవిడ్ కారణాంగా ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్ బిల్లుల మాఫీ ఇంకా అమలు కాకపోవటం.
  4. పెరిగిన విద్యుత్ ఖర్చులు భారంగా మారటం.
  5. ఓటీటీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది.
  6. టికెట్ల ధరలు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లటం.
  7. గతంలో గ్రామాలు, పట్టణాల్లో పన్నుల విధింపులో తేడాలు ఉండేవి. కానీ ప్రస్తుత అన్నిచోట్లా ఒకే రకమైన పన్ను విధిస్తున్నారు.
  8. ప్రభుత్వ జీవో 35 ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లోని ఏసీ థియేటర్లలో టికెట్ల ధరలు.. వరుసగా రూ.10, రూ.15, రూ. 20గా ఉన్నాయి. నాన్ ఏసీ థియేటర్లలో రూ. 5, రూ. 10, రూ.15 గా ఉన్నాయి.
  9. మున్సిపాలిటీ పరిధిలోని థియేటర్లలో రూ. 30, రూ.50, రూ. 70గా ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలో చూస్తే.. రూ. 40,రూ.60, రూ. 100గా ఉన్నాయి.

హీరో నాని వర్సెస్ మంత్రులు... ట్వీట్​తో సిద్ధార్థ్ ఎంట్రీ!
AP Ministers Vs Hero Nani: ఏపీలోని తాజా పరిణామాలపై హీరో నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విషయమై ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని హీరో నాని తప్పుబట్టారు. టికెట్​ రేట్లను తగ్గించడం ప్రేక్షకులను అవమానించినట్లేనని అన్నారు.

"(టికెట్ రేట్ల విషయంలో) ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్​ కాదు. అది మనందరికీ తెలుసు. రేపే (డిసెంబర్ 24) సినిమా రిలీజ్​ కాబట్టి, ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది. సినిమాలు, రాజకీయాలను పక్కనపెడితే.. మీరు ప్రేక్షకులను అవమానపరుస్తున్నారు. పది మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్​ కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటోంది. టికెట్ ధరలు పెంచినా.. కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది." - హీరో నాని

హీరో నాని వ్యాఖ్యలపై మంత్రులు అనిల్ కుమార్, కొడాలి నాని, కన్నబాబు, బొత్స సత్యనారాయణ ఘాటుగానే స్పందించారు. తమకు కొడాలి నాని తప్ప హీరో నాని తెలియదంటూ మంత్రి అనిల్.. కౌంటర్ ఇచ్చారు. సినిమా టికెట్ ధరలు తగ్గితే ప్రజలను అవమానించినట్లా ? అని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. నటుడు నాని వ్యాఖ్యలకు తనకు అర్థం తెలియరాలేదన్నారు. థియేటర్లలో తనిఖీలు లేకపోతే పరిశుభ్రత ఎలా వస్తుంది..? అని ప్రశ్నించారు.

"కొడాలి నాని తప్ప మాకు ఏ నానీ తెలియదు. సినీ పరిశ్రమలో దోపిడీ అరికట్టేందుకే చర్యలు. సినిమా ఖర్చులో 70 శాతం హీరోల రెమ్యునరేషనే ఉంటోంది. హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా? హీరోలు రెమ్యునరేషన్ తగ్గిస్తే సినిమా టికెట్ల ధర తగ్గుతుంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు హర్షిస్తుంటే హీరోలకు కడుపుమంట ఎందుకు? సినిమా అభిమానిగా కటౌట్లు కట్టి నేనూ నష్టపోయా" - అనిల్ కుమార్, ఏపీ మంత్రి

హీరో సిద్ధార్థ్ ట్వీట్...

Hero Siddharth tweet on Movie tickets: ఏపీలో టికెట్ల ధరలు వివాదంపై హీరో సిద్ధార్థ్‌ స్పందించారు. ట్విటర్ వేదికగా మంత్రులపై సెటైర్లు వేశాడు. '‘‘సినిమా ఖర్చు తగ్గించి, కస్టమర్స్‌కు డిస్కౌంట్‌ అందిస్తున్నామని మంత్రులు అంటున్నారు. మరి మేం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. వాటిని కొంతమంది విలాసాలకు ఖర్చు పెడుతున్నారు. ఇంకొందరు అవినీతి రూపంలో రూ.లక్షల కోట్లు కాజేస్తున్నారు. మీ విలాసాలు తగ్గించుకొని మాకు డిస్కౌంట్స్‌ ఇవ్వండి’'’ అంటూ ట్వీట్‌ చేశారు. మొత్తంగా ప్రస్తుత పరిణామాలు.. ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. సంక్రాంతి పండుగ ముందున్న దృష్ట్యా.. ఈ వ్యవహారం ఏదో రూపంలో పరిష్కరమైతే అందరికీ బాగుంటుందని ఎగ్జిబిటర్లు ఎదురుచూస్తున్నారు.

ఇదీచూడండి: Movie ticket price: సినిమా టికెట్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.