ETV Bharat / city

పురోహితుడి అవతారమెత్తిన అధికారి... పుష్కరాల్లో భక్తులకు సాయం - కర్నూలు జిల్లా వార్తలు

ఏపీలోని కర్నూలు జిల్లా రాంపురం ఘాట్​ వద్ద పురోహితులు లేక ఓ కుటుంబం ఇబ్బంది పడింది. వారిని గమనించిన ఓ అధికారి పురోహితుడిగా మారి పిండప్రదాన క్రతువును జరిపించారు. అధికారి చొరవను భక్తులు అభినందించారు. కానీ ఘాట్ల వద్ద పురోహితుల నియమించడంపై దేవాదాయశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పురోహితుల కొరతపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిండ ప్రదానాలు కోసం వచ్చిన భక్తులకు పురోహితులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.

పురోహితుడి అవతారమెత్తిన అధికారి...
పురోహితుడి అవతారమెత్తిన అధికారి...
author img

By

Published : Nov 24, 2020, 8:26 PM IST

పురోహితుడి అవతారమెత్తిన అధికారి...

కర్ణాటక రాయచూర్ నుంచి ఓ కుటుంబం తుంగభద్ర పుష్కరాలకు ఏపీలోని కర్నూలు జిల్లాకు గత శనివారం వచ్చారు. వారి తండ్రికి పిండ ప్రదానం చేసేందుకు పురోహితుల కోసం రెండు గంటలకు పైగా ఎదురుచూశారు. పురోహితులు ఎవరు వారికి కనిపించలేదు. నిరాశలో ఉన్న వారిని ఘాట్ పనులు నిర్వహిస్తున్న ఓ అధికారి గమనించారు. వారికి సాయం చేసేందుకు అధికారి పురోహితుడిగా మారారు. గత అనుభవంతో ఆ అధికారి సంప్రదాయ బద్ధంగా పిండ ప్రదాన పూజలు నిర్వహించి తర్పణం సమర్పించే వరకు మంత్రోచ్ఛారణ చేశారు. ఆ కుటుంబం అధికారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆ అధికారి నంద్యాలలోని అంజనేయస్వామి ఆలయ ఈవో రామాంజనేయ శర్మ అని తెలిసింది. ఆయన రాంపురం ఘాట్‌కు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పుష్కర విధులంటే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడటమే అన్నదానిని శర్మ చేతల్లో చూపించారని పలువురు అభినందించారు. ఈ విషయాన్ని ‘ఈటీవీ భారత్’ దేవాదాయశాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్లగా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆదిశేషనాయుడు... మంత్రాలయం, రాంపురం ఘాట్లకు కొత్తగా ఏడుగురు పురోహితులను పంపారు.

తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పురోహితులను అందుబాటులో ఉంచామంటూ దేవాదాయశాఖ చెబుతోంది. పుష్కరాల పాల్గొనేందుకు 448 మంది పురోహితులు దరఖాస్తులు చేసుకోగా 350 మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేశారు. భక్తుల రద్దీ లేకపోవడం, ఇతర కారణాలతో పురోహితులు చాలా మంది గైర్హాజరవుతున్నారు. పూజారుల భర్తీలో అధికారులు ఆలస్యంగా స్పందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఘాట్ల వద్దకు వచ్చే భక్తులకు పుణ్య స్నానం మాట పక్కన బెడితే కనీసం పిండ ప్రదానాలు పెట్టుకునే అవకాశం లేక అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు.

ఇదీ చదవండి : భాజపా నేతలు హైదరాబాద్‌లో చిచ్చుపెట్టాలనుకుంటున్నారా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.