ETV Bharat / city

OBC Commission: 'ఏ ప్రభుత్వమైనా బీసీ కమిషన్ ఆదేశాలు అమలుచేయాలి' - విశ్వేశ్వరయ్య భవన్‌

వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్​ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీసీ జాతీయ కమిషన్ ఛైర్మన్ భగవాన్​లాల్‌ సహానీ పాల్గొని ప్రసంగించారు. సదస్సులో తమిళిసై తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

obc commission national conference held in khairathabad

author img

By

Published : Sep 26, 2021, 4:10 PM IST

'ఏ ప్రభుత్వమైనా బీసీ కమిషన్ ఆదేశాలు అమలుచేయాలి'

దేశ ప్రజల్లో ఓబీసీ కమిషన్ భరోసా నింపిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఓబీసీ కమిషన్ ఆశాజనకంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్టు.. ఆశాభావం వ్యక్తం చేశారు. వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్​ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీసీ జాతీయ కమిషన్ ఛైర్మన్ భగవాన్​లాల్‌ సహానీతో కలిసి పాల్గొని ప్రసంగించారు. తెలుగులో ప్రసంగించి తమిళిసై అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆశాజనకంగా ముందుకు వెళ్లాలి...

"ఈ రోజుతో ఓబీసీ కమిషన్​ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్లలో ఎన్నో సంవత్సరాల పనిని పూర్తిచేసింది. ఈ ఓబీసీ కమిషన్​ అనేది ప్రజల్లో ధైర్యం, భరోసాతో పాటు ఆశలు నింపింది. ఈ కమిషన్​ భవిష్యత్తులో మరింత ఫలప్రదంగా, ఆశాజనకంగా, శక్తివంతంగా, విజయవంతంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా. ఈ ఓబీసీ కమిషన్​ను మనందరి కోసం రాజ్యాంగబద్ధం చేసిన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు." - తమిళిసై, గవర్నర్​

గొర్లు, బర్ల పంపిణీతో కాదు..

బీసీలు విద్యతోనే సమాజంలో గౌరవం పొందుతారని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా.. విద్యతోనే సమాజం అభివృద్ధి బాట పడుతుందని దత్తాత్రేయ స్పష్టం చేశారు.

"27 శాతం రిజర్వేషన్లతో బీసీలు మరింత బలపడతారు. విద్యతోనే సమాజంలో బీసీలకు గౌరవం దక్కుతుంది. సంక్షేమ పథకాల కింద పశువులు పంపిణీ చేస్తున్నారు. గొర్లు, బర్లు పంపిణీతో కాదు విద్యతోనే బీసీల అభివృద్ధి జరుగుతుంది. బీసీ కమిషన్‌కు గతంలో మాదిరి అధికారాలు లేవు. బీసీ కమిషన్‌కు ప్రధాని మోదీ చట్టబద్ధత కల్పించారు." - బండారు దత్తాత్రేయ, హరియాణా గవర్నర్​

ఏ ప్రభుత్వమైనా అమలు చేయాల్సిందే...

నరేంద్రమోదీ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాల పరిధిలో బీసీలకు రాజ్యాంగ సవరణ చేపట్టే అధికారం ఇచ్చామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

"ఆడబిడ్డలకు ఆత్మగౌరవం కల్పించేందుకు ఇంటింటికి టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాం. ఏ ప్రభుత్వమైనా బీసీ కమిషన్ ఆదేశాలు అమలుచేయాలి. కొన్ని ప్రభుత్వాలు కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయి. బీసీ కమిషన్‌ ఆదేశాలు అమలు చేయకపోతే అండగా నిలవాల్సిన బాధ్యత బీసీ సంఘాలదే. కేంద్రమంత్రివర్గంలో 27 మంది బీసీలు ఉన్నారు. రెండేళ్లుగా కొవిడ్‌తోనే సమయం వృథా అయింది. కరోనా వల్ల అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. బస్తీల్లో పేదలు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు.పేదల కోసమే ఆహారభద్రత చట్టం తీసుకొచ్చాం. దేశంలో 80 కోట్ల మందికి రూ.3 చొప్పున కిలో బియ్యం ఇస్తుంది. ఒక వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ." - కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి

సదస్సులో ఆందోళన..

జాతీయ బీసీ కమిషన్ సదస్సులో సదస్సులో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీసీ కులగణన చేయాలంటూ సంక్షేమ సంఘం సభ్యులు నినాదాలు చేశారు. బీసీ సంక్షేమ సంఘ సభ్యులను పోలీసులు బయటకు పంపారు. ఈ క్రమంలో పోలీసులకు బీసీ సంక్షేమ సంఘం సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.