మహాత్ముని జయంతి సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలంటూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. ప్లాస్టిక్ వద్దు.. చేతి సంచులే ముద్దు అంటూ నినాదాలు చేశారు. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ కృషిచేస్తుందని తెలిపారు.
ఇవీచూడండి: 'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'