కొవిడ్, బ్లాక్‌ఫంగస్‌పై ఎన్ఎస్యూఐ వర్చువల్ అవగాహనా సదస్సు నిర్వహించింది. కొవిడ్, బ్లాక్‌ఫంగస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం... నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుతో ఎందరో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహన కల్పించకుండా... లాక్డౌన్లు విధిస్తూ పోతే ప్రజలకు అవగాహన రాదన్నారు. వైద్య నిపుణుల సహకారంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా సదస్సు నిర్వహించినట్లు వెంకట్ తెలిపారు. వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలు పాటింటి కొవిడ్, బ్లాక్‌ఫంగస్ నుంచి సురక్షితంగా ఉండాలని వెంకట్ కోరారు.
పోస్ట్ కొవిడ్, డయాబెటిక్ రోగులు, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. సింగిల్ మాస్క్ పదేపదే వాడటం మంచిదికాదన్నారు. హైగ్రేడ్ జ్వరాలు, దద్దుర్లు, కడుపు నొప్పి, కండ్లకలక వంటివి పిల్లల్లో గమనించాలని... ఈ లక్షణాల విషయంలో ప్రారంభ దశలోనే ఆసుపత్రిలో చేర్చడం అవసరమన్నారు.