ETV Bharat / city

తప్పుకున్న ఎన్​పీసీఐ.. సైబర్‌ బాధితులకు మరిన్ని కష్టాలు!

author img

By

Published : Mar 6, 2021, 9:36 AM IST

పేమెంట్​ గేట్​వేలను పర్యవేక్షించే జాతీయ చెల్లింపుల కార్పొరేషన్​(ఎన్​పీసీఐ) తన బాధ్యతల నుంచి తప్పుకొంది. ఫలితంగా సైబర్​ బాధితులకు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి. పొగొట్టుకున్న నగదు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.

npci withdrawn from duties
తప్పుకున్న ఎన్​పీసీఐ.. సైబర్‌ బాధితులకు మరిన్ని కష్టాలు!

సైబర్‌ నేరస్థుల బారిన పడి రూ.వేలు, లక్షలు పోగొట్టుకుంటున్న బాధితుల సొమ్మును రక్షించే వ్యవస్థ పనిచేయడం లేదు. ఇందుకు ప్రత్యేకించిన పేమెంట్‌ గేట్‌వేలను పర్యవేక్షిస్తున్న జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఆ బాధ్యత నుంచి తప్పుకొంది.

అప్పట్లో ఇలా..

గతంలో బాధితులు ఫిర్యాదు చేయగానే, పోలీసులు ఆ సమాచారాన్ని ఎన్‌పీసీఐకి ఇచ్చేవారు. తద్వారా ఆ సంస్థ పేమెంట్‌ గేట్‌వేలకు సూచించి, 24 గంటల పాటు ఆ నగదు తీసుకోకుండా నిలువరించేది. ఆ తరవాత ఆ మొత్తాన్ని బాధితుడి ఖాతాకు తిప్పి పంపేది. ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తమ వద్ద అంతటి భారీ వ్యవస్థ లేదన్న ఎన్‌పీసీఐ బ్యాంకులకే ఆ బాధ్యతలను అప్పగించింది. బ్యాంకులు సకాలంలో స్పందించక పోవడం వల్ల సైబర్‌ నేరస్థుల ఖాతాల్లోకి నిరాటంకంగా నగదు బదిలీ అవుతోంది. ఒకవేళ ఆ మొత్తాన్ని నిందితులు విత్‌డ్రా చేసుకున్నా పేమెంట్‌ గేట్‌వే ద్వారా ఏ బ్యాంక్‌కు వెళ్లిందో గుర్తించేది. ఆ బ్యాంక్‌కు ఎఫ్‌ఐఆర్‌ను పంపి, బాధితుడు పోగొట్టుకున్న నగదును తిరిగి జమ చేయించేది. విదేశాల్లో నగదు విత్‌డ్రా చేసుకుంటే.. ఆరు వారాల్లో బాధితులకు ఆ డబ్బు అందేలా చేసేది.

సొమ్ము వెనక్కి రాదని..

అంతర్జాల ఆధారిత బ్యాంకు ఖాతాలు, గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం అందుబాటులోకి వచ్చాక అన్నీ అనుసంధానమై ఉంటున్నాయి. వీటి ద్వారా మనకు తెలియకుండానే డబ్బు బదిలీ అవుతోంది. ఇటీవల యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) వినియోగం పెరిగినా సైబర్‌ మోసాలు తగ్గలేదు. నగదు బదిలీ చేస్తున్నప్పుడు యూపీఐ సంకేత పదాన్ని నమోదు చేయడాన్ని అవకాశంగా మలుచుకున్న సైబర్‌ నేరస్థులు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే ఖాతాలున్న వారి సెల్‌ఫోన్‌లకు క్యూఆర్‌ కోడ్‌లు పంపించి యూపీఐ పాస్‌వర్డ్‌లు తెలుసుకుంటున్నారు. రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. బ్యాంకులకు వెళ్లినా యూపీఐ ఆధారంగా లావాదేవీలు జరిగాయి.. సొమ్ము వెనక్కి రాదని, నిందితులను అరెస్ట్‌ చేశాక చూద్దామని వివరిస్తున్నారు.

నగదు చెల్లింపులపై జాగ్రత్త..

బ్యాంకు ఖాతాలు, ఇ-కామర్స్‌ సంస్థల ద్వారా నగదు బదిలీ చేసే వారు ఒకట్రెండు సార్లు నిర్ధారించుకున్నాకే ఓకే చేయాలి. బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసినా, మీ పాత వస్తువులు కొంటామని ఆప్యాయంగా మాట్లాడినా సైబర్‌ నేరస్థులేనని గ్రహించాలి. గతేడాది 2431 సైబర్‌ మోసాల కేసులు నమోదైతే.. వాటిలో 60 శాతం నగదు బదిలీకి సంబంధించినవే.

-అవినాష్‌ మహంతి, సంయుక్త కమిషనర్‌(నేర పరిశోధన)

ఇవీచూడండి: క్యూఆర్​కోడ్​ స్కాన్​తో లక్షలు కొల్లగొడుతున్నారు

సైబర్ నేరగాళ్ల మోసాల పరంపర... స్కాన్​ చేస్తే నగదు మాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.