ETV Bharat / city

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు శంఖారావం నేడే - Nimmagadda Ramesh Kumar Latest news

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్​లో పంచాయతీ ఎన్నికల శంఖాన్ని నేడు ఏపీ ఎస్​ఈసీ పూరించనుంది. 4 దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించిన ఎస్​ఈసీ... ఇవాళ తొలి దఫా ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల చేయనుంది. ఎన్నికల ప్రక్రియలోని వివిధ తేదీలను ప్రకటిస్తూనే మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా.. ఇకపైనా దీన్ని కఠినంగా అమలు చేసేలా అధికారులకు ఎస్​ఈసీ దిశానిర్దేశం చేయనున్నారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు శంఖారావం నేడే
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు శంఖారావం నేడే
author img

By

Published : Jan 23, 2021, 7:48 AM IST

కరోనా దృష్ట్యా గత మార్చ్​లో వాయిదా పడిన ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ.. ఎట్టకేలకు తిరిగి ప్రారంభం కాబోతుంది. ఏపీ ఎస్​ఈసీ, ప్రభుత్వం వాదోపవాదాలతో వాయిదా పడుతూ వస్తున్న పల్లె పోరుకు నేటి నుంచి తెరలేవనుంది. పంచాయతీ ఎన్నికలకు గతేడాది మార్చి 15న నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా... కరోనా వ్యాప్తి వల్ల వాయిదా వేస్తున్నట్టు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ ప్రకటించారు. అప్పుడు నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించగా... ఇప్పుడూ ఆ విధంగానే చేపట్టనున్నారు. ఇప్పటికే షెడ్యూల్​ను ఎన్నికల కమిషన్ విడుదల చేయగా.... ఇవాళ ఉదయం 10 గంటలకు తొలి దఫా పంచాయతీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ కానుంది.

ఈ నెల 25నుంచి నామినేషన్ల స్వీకరణ

తొలి దశ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 25 నుంచి 3 రోజుల పాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు 27వ తేదీ వరకూ గడువు ఉండగా.. 28న వాటిని పరిశీలించనున్నారు. ఉపసంహరణకు జనవరి 31 మధ్యాహ్నం 3 గంటల వరకూ అవకాశముండగా... ఆ తర్వాత అదే రోజున తుది జాబితాను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి ఐదో తేదీన ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తారు. ఫలితాలు వెల్లడించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 17 వరకూ ఎన్నికల కోడ్

నాలుగు రోజుల వ్యవధిలోనే మిగతా విడతల ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. జనవరి 27, 31, ఫిబ్రవరి 4 తేదీల్లో... 2,3,4 దఫాల పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ అవనున్నాయి. ఫిబ్రవరి 9,13,17 తేదీల్లో ఆయా విడతల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 17 వరకూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. గ్రామాలవారీ రిజర్వేషన్లను... గతేడాది మార్చి​లోనే ఈసీ నిర్ణయించగా... ఇప్పుడు వాటినే అమలు చేయనున్నారు.

ఇదీ చదవండి: యాసంగిలో పెరిగిన సాగు... గణాంకాలు వెల్లడించిన వ్యవసాయ శాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.