ETV Bharat / city

ఆర్​. కృష్ణయ్యపై నాన్​ బెయిలబుల్​ కేసు.. ఎంపీగా ఎన్నికైన సమయంలోనే..! - బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​ కృష్ణయ్య

Case on R Krishnaiah: బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్యపై నాన్​బెయిలబుల్​ కేసు నమోదైంది. ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సమయంలో ఇలా కేసు నమోదు కావటం కాకతాళీయమే అయినా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఏ విషయంలో కేసు నమోదైందంటే..?

Non bailable case against R Krishnaiah at the time of electing as AP MP

author img

By

Published : Jun 3, 2022, 4:43 PM IST

Case on R Krishnaiah: బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, తాజాగా వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేసిన ఆర్.కృష్ణ‌య్య‌పై కేసు న‌మోదైంది. హైద‌రాబాద్‌కు చెందిన ర‌వీంద‌ర్ రెడ్డి కృష్ణయ్యపై కీలక ఆరోపణలు చేస్తూ.. కోర్టును ఆశ్రయించారు. హైద‌రాబాద్ ప‌రిధిలోని త‌న భూమిని ఆర్.కృష్ణ‌య్య క‌బ్జా చేశార‌ని రవీందర్ రెడ్డి ఆరోపిస్తూ.. కోర్టులో పిటిషన్​ వేశారు. త‌న భూమిని కబ్జా చేయ‌డంతో పాటుగా త‌న‌ను చంపేందుకు కూడా కృష్ణ‌య్య య‌త్నించారని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు రౌడీల‌ను పంపి త‌న‌ను బెదిరిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఆర్.కృష్ణ‌య్య‌పై కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల‌తో.. హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గం పోలీస్​స్టేష‌న్‌లో ఆర్‌.కృష్ణ‌య్య‌తో పాటు మ‌రికొంద‌రిపై నాన్ బెయిల‌బుల్ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదయ్యాయి. ఈ మేర‌కు ఐపీసీ సెక్ష‌న్లు 447, 427, 506, 384, రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఏపీ కోటా నుంచి వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఇటీవ‌లే ఆర్.కృష్ణ‌య్య నామినేష‌న్ దాఖ‌లు చేాశారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు నేటితో గ‌డువు ముగిసిన నేపథ్యంలో... మొత్తం 4 స్థానాల‌కు 4 నామినేష‌న్లే వచ్చాయి. ఈ క్రమంలో ఆర్.కృష్ణ‌య్య స‌హా వైసీపీ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇవీ చూడండి:

హైదరాబాద్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. నిందితుల్లో ప్రజాప్రతినిధుల కుమారులు.!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.