No Permission for TRS Rastaroko: కేంద్రంపై చేస్తున్న పోరాటంలో భాగంగా రాష్ట్రంలో నేడు చేపట్టిన, రేపు చేపట్టబోతున్న తెరాస రాస్తారోకో, ధర్నాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. కాకతీయ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాఖలయిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అనుమతి లేకుండా తెరాస ఆందోళన చేస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ధర్నాలతో ప్రజా రవాణాకు ఆటంకం కలుగుతోందన్నారు. తెరాస ఆందోళనలకు అనుమతులు ఉన్నాయా..? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
ధర్మాసనం ప్రశ్నలకు సమాధానమిస్తూ.. రాస్తారోకోలకు అనుమతి ఇవ్వలేదని హోంశాఖ స్పష్టం చేసింది. తమ దృష్టికి వచ్చిన అంశాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని న్యాయస్థానానికి తెలియజేసింది. జిల్లాల్లో తెరాస ఆందోళనలపై ప్రభుత్వ వివరణను రికార్డు చేసిన హైకోర్టు... పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలకు అనుమతి ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అనుమతి లేని ఆందోళనలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: