Central Minister Nithin Gadkari: రాష్ట్రంలో 7 వేల 853కోట్ల వ్యయంతో చేపట్టిన... 12 జాతీయ రహదారులకు కేంద్ర రోడ్డు రవాణశాఖమంత్రి నితిన్ గడ్కరీ నేడు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ ఉదయం పదిన్నరకు శంషాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనా వద్ద కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి 4 వేల 927కోట్ల వ్యయంతో చేపట్టనున్న.. 258 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.
ఇప్పటికే 2 వేల 926కోట్లతో సిద్ధమైన 96 కిలోమీటర్ల రహదారులను..గడ్కరీ ప్రారంభిస్తారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 10 వేల 57కోట్ల వ్యయంతో...12 వందల 78 కిలోమీటర్ల రహదారులను విస్తరించినట్లు కేంద్రం తెలిపింది.
ఇదీ చూడండి: