Vijayawada durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధనవమి నాడు జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ మహిషాసురమర్థినీ దేవిగా దర్శనమిస్తోంది. మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. నవదుర్గ రూపాల్లో ఈ రూపమే మహోగ్రరూపం. ఈ రోజున జగన్మాత కనకదుర్గమ్మ లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులను సాక్షాత్కరిస్తుంది.
ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వలన సర్వదోషాలు తొలగిపోతాయని.. సాత్విక భావం ఉదయిస్తుందనేది భక్తుల నమ్మకం. మహిషాసురమర్దనిగా ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. దసరా ఉత్సవాల్లో పదో రోజైన రేపు రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. రేపటితో ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు ముగియనున్నాయి
మూడో ఏడాదీ తెప్పోత్సవం రద్దు: కృష్ణా నదికి వరదనీరు ఎక్కువగా వస్తున్నందున దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించాల్సిన తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వరుసగా మూడో ఏడాది కూడా నౌకా విహారాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. దుర్గా ఘాట్ వద్ద హంస వాహనంపై పూజల నిర్వహణకే అనుమతించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు వరద వస్తోందని.. మరో 3 రోజుల పాటు ఈ ఉద్ధృతి కొనసాగే అవకాశముందని తెలిపారు.
ఇవీ చదవండి: