Boy fell in Borewell: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుగుంటలో బోరుబావిలో పడిన 9ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రామానికి చెందిన పూర్ణ జశ్వంత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతు గల బోరుబావిలో పడిపోయాడు. అయితే బాలుడు 30 అడుగుల లోతులో రాయిపై చిక్కుకున్నాడు. జశ్వంత్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. బోరుబావిలో నుంచి జశ్వంత్ కేకలు వేయడంతో స్థానికులు అతనిని గుర్తించారు. వెంటనే తాళ్ల సహాయంతో బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు.
సుమారు 5 గంటలపైనే జశ్వంత్ బోరు బావిలో బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. జశ్వంత్‌ను ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోరు బావి ప్రమాదం నుంచి జశ్వంత్ ప్రాణాలతో బయటపడటంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..: