NHRC on Kaleshwaram project: కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందంటూ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు అందింది. బ్యాక్ వాటర్ వల్ల 30 నుంచి 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఫిర్యాదులో ప్రస్తావించారు. పంటనష్టంతో రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదు దారుడి తరఫు న్యాయవాది.. కమిషన్ దృష్టికి తెచ్చారు.
ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: Bandi Sanjay Comments on KCR : 'కేసీఆర్ తుగ్లక్ చర్యలతో ఉద్యోగులకు ప్రమాదం'