ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

author img

By

Published : Oct 15, 2021, 6:05 AM IST

Updated : Oct 15, 2021, 9:04 PM IST

news today
news today

20:58 October 15

టాప్​న్యూస్​ @9 pm

  • దేశవ్యాప్తంగా

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా వేడుకల్లో(dasara festival 2021) చివరి రోజైన విజయదశమి పర్వదినం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రక్షణ మంత్రి రాజ్​నాథ్ కోవింద్ ఆయుధ పూజలు నిర్వహించారు.

సీఎం పూజలు

సీఎం కేసీఆర్​.. ప్రగతిభవన్​లోని నల్లపోచమ్మకు ఘనంగా పూజలు (Cm Kcr Pooja) నిర్వహించారు. కుటుంబంతో సహా పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం కుటుంబ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • మావోయిస్టు పార్టీ క్లారిటీ

మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మృతిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ధ్రువీకరించింది. ఆయన మృతి చెందినట్టు పార్టీ కేంద్ర కమిటీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది.

  • ట్రాక్టర్ బోల్తాపడి 11మంది మృతి

దసరా రోజున యూపీలోని ఝాన్సీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లు ప్రత్యక్షప్రసారం

టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) భారత్​ ఆడనున్న మ్యాచ్​లను తమ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పీవీఆర్​(PVR Cinemas News) ప్రకటించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్​ మండలితో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు పీవీఆర్​ సినిమాస్​ సీఈఓ గౌతమ్​ దత్తా తెలిపారు.

19:58 October 15

టాప్​న్యూస్​ @8 pm

  • టాస్​ గెలిచిన కోల్​కతా.. చెన్నై బ్యాటింగ్​

ఐపీఎల్​ 14వ సీజన్​ ఫైనల్​ మ్యాచ్​ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​, కోల్​కతా నైట్​​ రైడర్స్​ జట్లు(CSK Vs KKR) తలపడతున్నాయి. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన కోల్​కతా బౌలింగ్ ఎంచుకుంది.

  • వ్యాపారులకు నిరాశ..

విజయదశమి సందర్భంగా భారీగా ఆశలు పెట్టుకున్న వ్యాపారుల ఆశలు అడియాశలయ్యాయి. ఇవాళ నాన్​వెజ్​కు ఎక్కువ గిరాకీ ఉంటుందని భావించినా.. అమ్మకాలు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయని వ్యాపారులు వాపోతున్నారు. గతం కంటే తక్కువ ధరలే ఉన్నా.. విక్రయాలు మాత్రం ఆశించినంతగా లేవని చెబుతున్నారు.

  • మహిళను కొట్టి చంపారు!

మూఢనమ్మకం (Superstitious Beliefs) పేరుతో ఓ మహిళను దారుణంగా కొట్టి చంపారు. ఆమెకు అమ్మవారు పూనిందని.. కోపంతో అందరిని చంపేస్తోందని భయంతో మహిళ ప్రాణం తీశారు. ఈ దారుణ ఘటన గుజరాత్​లోని ద్వారకాలో జరిగింది.

  • విశ్వనాథ్ విశ్వరూపం

'కళా తపస్వి కె.విశ్వనాథ్ సినీ రంగానికే ఆదర్శం. ఆయన తీసిన సినిమాలు ఎంతో ప్రత్యేకం' అని ఆర్బీఐ విశ్రాంత ఉన్నతోద్యోగి డాక్టర్​ రామశాస్త్రి అన్నారు. చిన్ననాటి నుంచి.. కె.విశ్వనాథ్ గురించి, ఆయన సినిమాల గురించి తెలుసుకొని ముగ్దుడైన ఆయన ఏకంగా ఓ పుస్తకాన్నే రచించాడు. "విశ్వనాథ్ విశ్వరూపం" పేరుతో రచించిన పుస్తకాన్ని కె.విశ్వనాథ్ చేతుల మీదుగానే ఆవిష్కరింపజేశారు.

  • వేప పుల్ల కోసం గొడవ

పళ్లు తోముకునే పుల్ల విషయమై ఇద్దరి మధ్య చెలరేగిన వివాదం.. ఒకరి హత్యకు దారితీసింది. ఈ దారుణం ఝార్ఖండ్​లో (Jharkhand Latest News) జరిగింది.

18:54 October 15

టాప్​న్యూస్​ @7 pm

  • 2024 ఎన్నికలకు ముందే

అయోధ్యలో రామ మందిర (Ayodhya Ram Mandir) నిర్మాణం సాధారణ ఎన్నికల (Lok Sabh Election 2024 ) కంటే ముందే పూర్తి కానుందని ఆలయ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. డిసెంబర్​ 2023 నాటికి భక్తుల కోసం ఆలయ తలుపులు తెరుచుకుంటాయని ట్రస్ట్​ జనరల్​ సెక్రెటరీ చంపత్​ రాయ్​ పేర్కొన్నారు.

  • ప్రభుత్వ హత్యే

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని అతని కుటుంబ సభ్యులు (Mavoist Rk Family) ఆరోపిస్తున్నారు. ఆర్కే చివరి చూపు చూసుకోవడం కోసం మృతదేహాన్ని తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

  • నరహంతక పులి నిర్బంధం

తమిళనాడు-నీలగిరి జిల్లాలో ఆపరేషన్‌ టైగర్‌ విజయవంతమైంది. 22 రోజుల గాలింపు ప్రక్రియ తర్వాత మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల మేరకు నరహంతక టీ-23 పులిని ప్రాణాలతో నిర్బంధించారు. నలుగురు గ్రామస్థులు సహా 20కిపైగా జంతువులను చంపటం వల్ల మసినగుడి ప్రాంతంలో కలకలం రేగింది. అటవీ శాఖాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పులిని బంధించారు.

  • చెన్నైకి షాక్‌ ఇచ్చిన కేకేఆర్

ఐపీఎల్‌ 2021(IPL 2021) ఆఖరి పోరు మరికొద్ది గంటల్లో మొదలుకానుంది. టైటిల్‌ కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌(Chennai Super kings), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) తలపడబోతున్నాయి. అయితే ఈ ఫ్రాంచైజీ టోర్నీ ఫైనల్‌లో ఈ రెండు జట్లు రెండోసారి పోటీపడనున్నాయి. 

  • చిరు-చరణ్​తో 'కేజీఎఫ్' డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi family) ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీకి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్​నీల్(prashanth neel upcoming movies) వచ్చారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఇందులో చరణ్​తో కలిసి ఆయన ఉండటం వల్ల అభిమానులు అప్పుడే సినిమా చేస్తారంటూ గుసగుసలాడేసుకుంటున్నారు.

18:13 October 15

టాప్​న్యూస్​ @6 pm

  • సీఎం పూజలు

  • ప్రజలపైకి దూసుకెళ్లిన కారు

ఛత్తీస్​గఢ్​ జశ్​పుర్​లో దారుణ ఘటన జరిగింది. పతాలగావ్​లో దుర్గామాత విగ్రహ నిమజ్జనానికి వెళుతుండగా.. ఓ బృందంలోని 20మందిపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఘటన నుంచి తేరుకున్న అనంతరం స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

  • బిడ్డతో సహా మ్యాన్​హోల్​లో

హరియాణాలో నిర్లక్ష్యంతో ఓ మహిళ తన ప్రాణాలు, తన బిడ్డ ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చింది. ఫరీదాబాద్​లోని జవహర్​ కాలనీలో.. ఓ మహిళ బిడ్డను ఎత్తుకుని ఫోన్​ మాట్లాడుతూ కాలినడకన బయటకు వెళ్లింది.

  • మోర్గాన్‌ కన్నా ధోనీనే

శుక్రవారం జరగనున్న ఐపీఎల్​ ఫైనల్​లో(IPL 2021 Final) చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రాణించే అవకాశం ఉందని అంటున్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​(Gautam Gambhir News). తుదిపోరులో సీఎస్​కేతో కోల్​కతా నైట్​రైడర్స్(CSK Vs KKR)​ తలపడనున్న నేపథ్యంలో చెన్నై కెప్టెన్​ ధోనీ.. కేకేఆర్​పై పైచేయి సాధించే అవకాశం ఉందని తెలిపాడు.

16:51 October 15

టాప్​న్యూస్​ @5 pm

  • సూపర్ ప్లాన్‌!

కేంద్ర ఎన్నికల సంఘం (Huzurabad CEC Rules) సరికొత్త నిబంధనలను రూపొందించింది. వాటిని హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయాలని సూచించింది. కానీ ఆయా పార్టీలు సీఈసీ నియమాలను తుంగలో తొక్కి ఇష్టానుసారం వ్యహరిస్తున్నాయి.

  • అపార 'నమ్మకం'

ఇప్​సోస్​ గ్లోబల్​ ట్రస్ట్​వర్తీనెస్​ ఇండెక్స్​-2021 విడుదలైంది(ipsos research). భారత జాబితాలో సాయుధ దళాలు, శాస్త్రవేత్తలు టాప్​లో నిలిచారు. వీరిపై తమకు ఎక్కువ నమ్మకం ఉందని ప్రజలు స్పష్టం చేశారు(ipsos global news). రాజకీయ నేతలు, మంత్రులపై తమకు విశ్వాసం లేదని అటు భారతీయులు, ఇటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తేల్చిచెప్పారు.

  • చిన్నారిపై అత్యాచారం

ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 20 ఏళ్ల యువకుడు. ఘటన జరిగే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్​లోని జలోర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

  • నోరూరించే పూరన్‌ పోలీ

శరన్నవరాత్రుల్లో మహాశక్తిగా కొలిచే దుర్గామాతకు భక్తులు నవ నైవేద్యాలను(Dussehra special food) సమర్పిస్తారు. ఆరగించరమ్మని ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లోని రుచుల వంటకాలు ఎలా తయారు చేస్తారో తెలుసుకోండి.

16:19 October 15

టాప్​న్యూస్​ @4 pm

  • ఘనంగా దసరా వేడుకలు

  • జంబూసవారీకి సిద్ధం

కర్ణాటకలోని మైసూర్​ ప్యాలెస్​లో దసరా ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దసరా పర్వదినం సందర్భంగా మాహారాజ యదువీర్ కృష్ణదత్త​ శమీ వృక్షానికి పూజలు చేశారు. శుక్రవారం సాయంత్రం జంబూ సవారీ జరగనుంది.

  • నిజరూప దర్శనం

విజయదశమి సందర్భంగా వరంగల్​ భద్రకాళీ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళీ అమ్మవారు నిజరూప దర్శనమిచ్చారు. వేయి స్తంభాల గుడిలో రాజరాజేశ్వరీ అలంకరణలో అమ్మవారు కనువిందు చేశారు.

  • మునుపెన్నడూ లేనంత

మునుపెన్నుడూ లేనంతగా రక్షణ రంగంలో పారదర్శకత, విశ్వాసం పెంపొందాయని (defence sector reforms) ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ స్థానంలో ఏర్పాటు చేసిన 7 ఆయుధ కర్మాగారాలను జాతికి అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ పాల్గొన్నారు.

  • మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్ రివ్యూ

ప్రేమ, పెళ్లి నేపథ్య కథతో తీసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరించింది. దర్శకుడు ఏం చెప్పారు? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

14:39 October 15

టాప్​న్యూస్​ @3 pm

  • సాయం చేయబోతే

పని మీద వెళ్తుంటే చెంబులో తల చిక్కుకుని ఓ పిల్లి పాట్లు పడటం కనిపించింది. వెళ్లి దాని తల బయటకు తీసి సాయం చేద్దామనుకున్నారు ఆ వ్యక్తి. దగ్గరగా వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకోగానే.. చేతిని కరిచింది. ఒక్కసారిగా చూసి అది పిల్లి కాదు చిరుతపులి పిల్ల అని అర్థమై వెంటనే చేతుల్లోంచి కిందకు విసిరేశారు. 

  • తెలుగు విద్యార్థుల సత్తా!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు(jee advanced result) విడుదలయ్యాయి. ఐఐటీ ఖరగ్​పుర్​.. జేఈఈ అడ్వాన్స్​డ్​ ర్యాంకులను ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఐఐటీ దిల్లీకి చెందిన మృదుల్ అగర్వాల్ టాపర్​గా నిలిచాడు.

  • పోస్టర్ల కళకళ

దసరా పండగ(dussehra cinema) వేళ చిత్రసీమలో సందడి నెలకొంది. కొత్త సినిమా పోస్టర్లు కళకళలాడుతున్నాయి. ఆయా చిత్రబృందాలు ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ వాటిని రిలీజ్​ చేశాయి. ఆ పోస్టర్లపై ఓ లుక్కేద్దాం..

  • నెట్స్​లో ధోనీ హెలికాప్టర్​ షాట్

ఐపీఎల్​ 14(IPL 2021) సీజన్​ తుది పోరు శుక్రవారం జరగనున్న నేపథ్యంలో చెన్నై సూపర్​ కింగ్స్(CSK vs KKR 2021)​ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ధోనీ హెలికాప్టర్​ షాట్​తో అదరగొట్టిన తీరు నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ పోరులో చెన్నై సూపర్​ కింగ్స్​తో తలపడనుంది కోల్​కతా నైట్​రైడర్స్​.

13:49 October 15

టాప్​న్యూస్​ @2 pm

  • ఆర్కే ఎప్పుడు చనిపోయారంటే..

మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మృతిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ధ్రువీకరించింది. ఆయన మృతి చెందినట్టు పార్టీ కేంద్ర కమిటీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికారిక ప్రతినిధి అభయ్‌ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. నిన్న ఉదయం 6గంటలకు ఆర్కే కన్నుమూసినట్టు ప్రకటనలో వెల్లడించారు. విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు జరిపినట్లు స్పష్టం చేశారు.  కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆర్కే.. డయాలసిస్‌ జరుగుతుండగా మృతిచెందారని పేర్కొన్నారు.

  •  పండ్ల మార్కెట్ ప్రారంభం

రంగారెడ్డి జిల్లా బాటసింగారం లాజిస్టిక్స్ పార్కు (Batasingaram Logistics Park)లో పండ్ల మార్కెట్ (Fruit market) ప్రారంభం అయ్యింది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ (Fruit market) తరలించి బాటసింగారం (Batasingaram)లో మార్కెట్‌ కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. 

  • మైసూర్​ ప్యాలెస్​లో దసరా వేడుకలు

  • అమీతుమీకి చెన్నై, కోల్​కతా రెడీ

ఐపీఎల్ 14(IPL Final 2021) తుది అంకానికి వచ్చేసింది. నేడు(అక్టోబర్ 15)న చెన్నై సూపర్​ కింగ్స్, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లు​(CSK vs KKR 2021) టైటిల్ కోసం తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో 'విజయ' దశమి ఎవరిది కాబోతుందోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • దసరా స్పెషల్​.. కొత్త సినిమా పోస్టర్ల కళకళ

12:47 October 15

టాప్​న్యూస్​ @1pm

  • వైభవంగా చక్రస్నానం..

తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరి అంకమైన శ్రీవారి చక్రస్నానం వైభవంగా సాగింది. కరోనా దృష్ట్యా ఆలయంలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవ రోజుల్లో బహురూపులతో.. విభిన్న వాహనాల్లో దర్శనమిచ్చాడు దేవదేవుడు.. ఆనంద నిలయానికి చేరుకునే ముందు.. ఆ స్వామికి, ఉభయ దేవేరులకు.. చక్రత్తాళ్వార్లకు.. స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలతో అర్చకులు చేసే అభిషేక కైంకర్యాన్ని అందుకుని.. ధూప దీపాదికంతో వేంకటేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు.

  • మోదీని నమ్ముకుంటే ఈసారి కష్టమే

'ఈసారి జరగనున్న ఎన్నికల్లో మోదీని నమ్ముకుంటే విజయం సాధించడం కష్టమేనంటూ' కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్. మోదీ ప్రజాకర్షణ శక్తితోపాటు కార్యకర్తల శ్రమ తోడైతేనే విజయం సాధ్యమని స్పష్టం చేశారు. హరియాణాలో ఈ నెల 30న జరగనున్న ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

  • వీడియో చూడండి.. ‘డబ్బు పొందండి’

ఇళ్లు, వాహనాలు, ఇతర వస్తువులు అమ్మడం చూశాం. ఇప్పుడు కొందరు వందలాది వెబ్‌సైట్లను విక్రయానికి పెట్టారు. అదీ కూడా ప్రత్యేక స్కీంలో అంటూ ఊదరగొట్టారు. వీటిల్లో అప్‌లోడ్‌ చేసే వీడియోలు చూస్తే చాలు.. డబ్బులే డబ్బులంటూ ‘సినిమా’ చూపించారు. హమ్మయ్యా.. అప్పులు తీరే మార్గం కనిపించిదంటూ ఓ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఎగిరి గంతేశాడు. తీరా చూస్తే.. సదరు కేటుగాళ్లు రూ.6.31 లక్షలకు టోకరా వేయడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

  • ఆర్థిక విజయం మీదే!

విజయ దశమి అంటేనే చెడు మీద మంచి గెలిచిన వేళ. వైభవంగా, ఉత్సాహంగా జరుపుకునే ఈ పండగ సమయంలో మనలోని మంచిని పెంచుకోవడంతో పాటు ఆర్థిక అంశాల్లోనూ మంచి అలవాట్లను అలవరచుకోవాలి. ముఖ్యంగా కరోనా నేర్పిన పాఠాల నడుమ ఇవి అత్యంత ముఖ్యంగా మారాయి. ఈ పండగ వేళ.. ఆర్థిక విజయాన్ని సాధించేందుకు పాటించాల్సిన పది సూత్రాలేమిటో చూద్దామా.?

  • సీనియర్​ నటుడు కన్నుమూత

ప్రముఖ సీనియర్​ నటుడు(gk govinda rao news), రచయిత జీకే గోవింద్​ రావ్​(84) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

12:04 October 15

టాప్​న్యూస్​ @12 noon

  • అదే దసరా స్ఫూర్తి..

రాష్ట్రప్రజలకు పలువురు రాజకీయ ప్రముఖులు దసరా శుభాకాంక్షలు(CM KCR Dussehra Wishes) తెలిపారు. లక్ష్యసాధనలో విశ్రమించకూడదనేది దసరా స్ఫూర్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చెడుమీద మంచి విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు.

  • ఆ బామ్మ అదృష్టవంతురాలు

మధ్యప్రదేశ్​ పిపరియా రైల్వే స్టేషన్​లో పనిచేసే పోలీస్​ సమయస్ఫూర్తి ఓ వృద్ధురాలిని కాపాడింది. వృద్ధురాలు పట్టాలు దాటుతుండగా.. అకస్మాత్తుగా రైలు వచ్చింది. బయటపడే ప్రయత్నంలో ప్లాట్​ఫామ్​ చివర కదలలేక కూర్చిండిపోయింది ఆమె. అది గమనించిన ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ వేగంగా ఆమెను వెనక్కు లాగి ప్రాణాలు కాపాడాడు. దీంతో ప్రమాదం తప్పింది.

  • బిల్​క్లింటన్​కు అనారోగ్యం

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతున్న 75ఏళ్ల ఆయన.. కాలిఫోర్నియాలోని ఆస్పత్రిలో చేరినట్లు ఓ అధికారి వెల్లడించారు.

  • ధోనీ హెలికాప్టర్​ షాట్.. వీడియో వైరల్

  • రామ్​చరణ్​ గ్రీన్​సిగ్నల్​

హీరో రామ్​చరణ్(RC 16 movie)​ మరో కొత్త పాన్​ ఇండియా మూవీకి ఓకే చెప్పారు. తన కొత్త చిత్రాన్ని గౌతమ్​ తిన్ననూరి దర్శకత్వంలో(gowtam tinnanuri ram charan) నటించనున్నారు. చెర్రీ 16వ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రూపొందనుంది.

11:43 October 15

టాప్​న్యూస్​ @11 am

  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి ఈ నెల 3న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలను ఐఐటీ ఖరగ్‌పుర్‌ ప్రకటించింది.

  • దారుణ హత్య.. అర్ధనగ్నంగా మృతదేహం

అన్నదాతలు ఆందోళన చేస్తున్న సింఘు సరిహద్దులో ఓ వ్యక్తి మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం చేయి నరికేసి, అర్ధ నగ్నంగా ఉన్న ఓ వ్యక్తి మృతదేహం బారికేడ్లకు వేలాడుతూ కనిపించింది. సాగు చట్టాల రద్దు కోరుతూ గత కొన్నాళ్లుగా రైతులు ఈ సరిహద్దు వేదికగా నిరసనలు చేపడుతున్నారు.

  • నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు నియమితులైన ఏడుగురు కొత్త జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబరు 16వ తేదీన కొలీజియం పంపిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (President Ramnath Kovind) ఆమోదం తెలిడంతో... జస్టిస్ పి.శ్రీసుధ, జస్టిస్ సి.సుమలత, జస్టిస్ డాక్టర్‌ జి.రాధా రాణి, జస్టిస్ ఎం.లక్ష్మణ్‌, జస్టిస్ ఎన్‌.తుకారాంజీ, జస్టిస్ ఎ.వెంకటేశ్వరరెడ్డి, జస్టిస్ పి.మాధవి దేవి హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు.

  • పండగ రోజు  బంగారం ధరలు ఇలా..

దసరా రోజు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి (Gold Rate Today) ధరల్లో పెద్దగా మార్పు లేదు. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.

  • సాయితేజ్​ డిశ్చార్జ్​..

ఇటీవల(sai dharam tej discharge) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్టు చిరు తెలిపారు(sai dharam tej chiranjeevi). నేడు(అక్టోబర్​ 15) తేజ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా విషెస్‌ చెప్పారు.

10:13 October 15

టాప్​న్యూస్​ @ 10AM

అప్పగించారు.. మెలిక పెట్టారు.

జలవిద్యుత్ కేంద్రాలను ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించింది. శ్రీశైలం కుడిగట్టు పవర్​హౌస్​, సాగర్ కుడి కాల్వ విద్యుత్ కేంద్రాన్ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా జలవిద్యుత్​ కేంద్రాలను అప్పగించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ అప్పగించాకే బోర్డు పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. పవర్ ప్రాజెక్టుల్లోని భవనాలు, కట్టడాలు, యంత్ర సామగ్రి అప్పగించింది. 

  • రూ. 10 కోట్లు కొల్లగొడితే... రూ. 2.54 కోట్ల కమీషన్‌

కరోనాతో అతడి ఆర్థిక పరిస్థితి చితికిలపడింది. అదే సమయంలో ఓ మిత్రుడు పరిచయమయ్యాడు. ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో అతడు చెప్పిన ప్లాన్​కు తలాడించాడు. తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఉంటే ఆ ప్లాన్ అమలు సులభమవుతుందని అతను చెప్పగా.. తన దగ్గరి బంధువు, చెల్లెలు వరసయ్యే ఆమె సాయం కోరాడు. ఆమె ఓకే అనడంతో అందరూ కలిసి కోట్లు కొల్లగొట్టారు. వారికి సాయం చేసినందుకు బ్యాంక్ మేనేజర్​కు, ఆమె సోదరుడికి కమీషన్ ఇచ్చారు. ఈ విధంగా తెలుగు అకాడమీ ఎఫ్​డీల గోల్​మాల్(Telugu Academy FD Scam Updates)​లో సూత్రధారి అయిన ఆ వ్యక్తి(సాంబశివరావు)ని పోలీసులు అరెస్టు చేశారు.

  • జమ్మూకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్మూకశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఆర్మీ సిబ్బంది వీర మరణం పొందారు. పూంఛ్​ జిల్లాలోని మెందార్​ సబ్​డివిజన్​లో కొద్ది రోజులుగా ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెాందారు.

  • 'జబర్దస్త్​'లో బాలకృష్ణ..

'జబర్దస్త్'​ షోలో త్వరలో సందడి చేయనున్నారు స్టార్​ హీరో బాలకృష్ణ. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. వచ్చేవారం ప్రసారం కానున్న ఎపిసోడ్​ ప్రోమో నవ్వులు పూయిస్తోంది. ఈ సందర్భంగా జబర్దస్త్ జడ్జి రోజాతో ఫోన్​లో​ మాట్లాడిన బాలయ్య.. షోకు వస్తానని మాటిచ్చారు.

  • కోహ్లీతో జరిగిన పోరు మరిచిపోలేను

ఈ ఏడాది టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీని(Kohli vs Anderson) తాను ఎదుర్కొన్న తీరు ఎప్పటికీ మరిచిపోలేనని అన్నాడు ఇంగ్లాండ్ ఫాస్ట్​ బౌలర్ జేమ్స్ అండర్సన్. రానున్న యాషెస్ సిరీస్​​లో(Ashes 2021) ఆస్ట్రేలియా స్టార్​ బ్యాట్స్​మన్ స్టీవ్​ స్మిత్​ తన(James Anderson News) నెక్స్ట్​ టార్గెట్ అని చెప్పాడు.

09:05 October 15

టాప్​న్యూస్​ @ 9AM

  • పండగ రోజూ మోతే..

పెట్రోల్ ధరల (Petrol Price) పెంపు నుంచి దేశ ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. దసరా రోజు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాయి చమురు సంస్థలు. లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

  • ప్రచారంలో మరింత జోరు..

మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజూరాబాద్(Huzurabad By Elections 2021)​లో చెలరేగిన దుమారం ఇప్పటికీ కొనసాగుతోంది. అప్పటి నుంచే అధికార తెరాస, భాజపాలు ఒకరిపైమరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల్ని తమవైపు ఆకర్షించుకునేందుకు పావులు కదిపారు. రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయం మరికొన్ని రోజుల్లో పోలింగ్(Huzurabad By Elections 2021) ఉన్నందున ప్రధాన పార్టీలు ప్రచారజోరు పెంచాయి. ఇప్పటికే ప్రచారంతో నియోజకవర్గంలో హోరెత్తిస్తున్న ఈ పార్టీలు దసరా పండుగ తర్వాత అగ్రనేతలను రంగంలోకి దింపి మరింత వేడిని రాజేయనున్నాయి.

  • విద్యార్థుల ఎదురుచూపులు..

నీట్ ఫలితాల(NEET EXAM RESULTS 2021) కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పరీక్ష జరిగి నెలరోజులు దాటినా.. ప్రిలిమినరీ కీ కూడా విడుదల కాలేదు. ప్రశ్నాపత్రం లీకవ్వడం వల్లే ఫలితాల వెల్లడిలో జాప్యం అవుతోందనే అభిప్రాయం ఉంది. మరోవైపు ఈ నెలఖారులోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని నిపుణులు అంటున్నారు.

  • మితిమీరిన తాలిబన్ల జోక్యం..

అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌కు తమ విమాన సర్వీసులు (pakistan airline suspends to afghan) నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) ప్రకటించింది. తాలిబన్ల మితిమీరిన జోక్యం కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

  • టీ20లకు పనికిరాడు

టీమ్​ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​పై సంచలన కామెంట్స్ చేశాడు భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్(Manjrekar on Ashwin). టీ20ల్లో అశ్విన్​కు(Ashwin News) ఆడే సామర్థ్యం లేదని వ్యాఖ్యానించాడు.

07:58 October 15

టాప్​న్యూస్​ @ 8AM

  • సామాజిక సమస్యలపై నిరసన గళం

నాటి పల్నాడు(PALNADU)లో ఫ్యాక్షన్‌ పరిస్థితులు, సారా విక్రయదారుల ఆగడాలు.. జనం కష్టాలతో సతమతమవడం కళ్లారా చూసిన అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే (Maoist Leader RK) ఎంతగానో చలించిపోయారు. అప్పట్లో పల్నాడులోని పల్లెల్లో సారా తయారీ, విక్రయాలు పెద్దఎత్తున జరిగేవి. సారా తయారీ, రవాణాకు ప్రత్యేకంగా గుత్తేదారులు ఉండేవారు. గుత్తేదారులందరినీ ఆర్కే గ్రామాల నుంచి వెళ్లగొట్టారు. అప్పటి ఫ్యాక్షన్‌ పరిస్థితులను మార్చాలంటే పీపుల్స్‌వార్‌ ఉద్యమమే మార్గమని విశ్వసించి వారి భావాలకు ఆకర్షితులై ఉద్యమబాట పట్టారు.

  • పండుగ పూట ప్రమాదం

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఆర్టీసీ బస్సు (BUS ACCIDENT) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. 

  • అమ్మవారి పేర్లతోనే వెలిశాయి

నవరాత్రుల్లో దుర్గమ్మ కొలువై ఉన్న ప్రాంతాలను సందర్శించడం పరిపాటే. దేశంలోని ఎన్నో ప్రముఖ నగరాలు అమ్మవారి పేరుతోనే వెలిశాయి. మరి ఆ నగరాలేంటో, వాటికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

  • రూ.3,345 కోట్ల పెట్టుబడి

రాబోయే నాలుగున్నరేళ్లలో రూ.3,345 కోట్ల విలువైన పెట్టుబడులు పెడతామంటూ పలు కంపెనీలు సమర్పించిన 31 ప్రతిపాదనలకు టెలికాం విభాగం ఆమోదం (డాట్‌) తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. ఆయా కంపెనీల పెట్టుబడుల ఫలితంగా రూ.1.82 లక్షల కోట్ల మేర ఉత్పత్తి పెరిగేందుకు అవకాశం ఉండగా.. 40,000కి పైగా ఉద్యోగాల సృష్టి జరగనుంది.

  • పీలే రికార్డును అధిగమించిన ఛెత్రి

అంతర్జాతీయ ఫుట్​బాల్​లో మరో ఘనత సాధించాడు భారత ఫుట్​బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి(Sunil Chhetri News). ఫుట్​బాల్ దిగ్గజం పీలేను అధిగమించి.. అత్యధిక గోల్స్ సాధించిన వారిలో ఆరో స్థానానికి చేరుకున్నాడు.

07:01 October 15

టాప్​న్యూస్​ @ 7AM

  • శక్తి స్వరూపిణి.. జగన్మాత

'ఆబ్రహ్మకీటజనని' అయిన ఆ జగన్మాత అవసరాన్ని అనుసరించి నాలుగు, పది, పద్దెనిమిది చేతులతో... ఆయుధధారిణిగా, మహోగ్రరూపిణిగా, శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. అమ్మవారి 'ఆకృతి', 'ఆయుధాలు', 'వాహనం'... ఈతరం స్త్రీమూర్తులకు నిత్యజీవన మార్గదర్శకాలై... సమస్యలతో పోరాడే శక్తినీ, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే యుక్తినీ అందిస్తూ అడుగడుగునా స్ఫూర్తిని నింపుతాయి.

  • ఒక్క క్లిక్ కొడితే చాలు..

దసరా, దీపావళి, క్రిస్మస్‌.. పండగల సీజన్‌ వచ్చేసింది. ఇల్లు సర్దుకోవడం, దులపడం, కడగడం పెద్ద పని. ఇప్పుడు ఆన్‌ డిమాండ్‌ హోమ్‌ సర్వీసులు(home cleaning services apps) అందుబాటులోకి వచ్చేశాయి. యాప్‌లో ఒక్క క్లిక్‌ కొడితే చాలు సిబ్బంది మీ ఇంటికొచ్చి అవన్నీ చక్కబెట్టేసి వెళ్లిపోతారు. వంటగది మొత్తాన్ని శుభ్రపరచటానికి (కిచెన్‌ డీప్‌ క్లీనింగ్‌కు) అర్బన్‌ కంపెనీ రూ.1,288 ఛార్జి చేస్తోంది.

చేతులు తడపాల్సిందే..!

పేదింట ఆడపిల్ల పెళ్లి ఉంటే పది మంది తలా ఓ చేయి వేసి తోచిన విధంగా సహాయం చేస్తారు. ప్రభుత్వం సైతం పేద ఆడపిల్లల వివాహానికి అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్‌ (shadi mubarak) పథకాలను ప్రవేశపెట్టింది. అర్హులకు రూ.1,00,116 చొప్పున అందజేస్తోంది. ఆ ఆర్థిక సాయంలో కొందరు రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ మధ్యవర్తులతో కలిసి దొరికినంత దోచుకుంటున్నారు. దరఖాస్తుల పరిశీలన, చెక్కుల పంపిణీ పేరిట ఒక్కొక్కరి నుంచి వేలల్లో వసూలు చేసినట్లు విజిలెన్స్‌ విభాగం పరిశీలనలో వెల్లడైంది.

  • కొవిడ్‌ టీకాతో బాలలకు రక్ష!

భారత్‌లో పాఠశాలలు, కళాశాలలు మళ్లీ ప్రారంభం కావడం వల్ల బాలల టీకా కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ నేపథ్యంలో పిల్లలకు టీకా వేసి బడులకు పంపడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందరికీ భరోసా కల్పిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  • ఇకపై అలాంటి సినిమాలే చేస్తా

వందకిపైగా(Pellisandadi movie) సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన కథానాయకుడు శ్రీకాంత్‌ వారసుడు రోషన్‌ ఇప్పటికే వెండితెరకు పరిచయమయ్యాడు. తాజాగా తన తండ్రి చేసిన 'పెళ్లిసందడD' పేరుతోనే ఓ సినిమా చేశాడు. అప్పటి చిత్రానికి దర్శకత్వం వహించిన కె.రాఘవేంద్రరావు(raghavendra rao pelli sandadi), నేటి చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం. ఆయన నటుడిగానూ ఈ చిత్రంతోనే పరిచయం అవుతున్నారు. ఈ మూవీ నేడు(అక్టోబర్​ 15) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ.

05:18 October 15

టాప్​న్యూస్​ @ 6 AM

  • కన్నుల పండువగా..

పల్లెలన్నీ పూలవనాలను తలపించాయి. గాజుల చేతుల చప్పట్లతో... వీధులన్ని మారుమోగాయి. హరివిల్లు నేలపై పరుచుకుందా అన్నట్లుగా... మహిళలు, యువతుల అలంకరణతో ఊర్లన్నీ సందడిగా మారాయి. గౌరమ్మను కొలుస్తూ జరుపుకున్న సద్దుల బతుకమ్మ వేళ.... రాష్ట్రమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 

  • అప్పగింతపై హైడ్రామా..

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఆధీనంలోకి ఇంకా ప్రాజెక్టులేవీ రాలేదు. పెద్దవాగును స్వాధీనం చేయాలని గోదావరి బోర్డు... శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన 15 ఔట్ లెట్లను స్వాధీనం చేయాలని కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలను కోరాయి. కృష్ణాకు సంబంధించి కొన్ని ఔట్ లెట్లను స్వాధీనం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షరతులతో కూడిన ఉత్తర్వు వెలువరించింది. తెలంగాణ మాత్రం ఇంకా ఎటువంటి అభిప్రాయం చెప్పలేదు.

  • నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

 హైకోర్టులో నూతనంగా నియమితులైన న్యాయమూర్తులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు (High Court new judges to be sworn on today). హైకోర్టులో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కొత్త జడ్జీలతో ప్రమాణం చేయించనున్నారు.

  • జేఈఈ అడ్వాన్స్​డ్​ ర్యాంకులు విడుదల

ఐఐటీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్​డ్ ర్యాంకులు నేడు విడుదల కానున్నాయి (JEE ADVANCED RANKS). ఇటీవల విడుదలైన కీ ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి పది లోపు ర్యాంకు ముగ్గురు లేదా నలుగురికి.. వంద లోపు ర్యాంకులు కనీసం 25 ఉంటాయని శిక్షణ సంస్థల అంచనా.

  • ఆమె నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉంది

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న ఎలాంటి నిర్ణయమైనా తనకు ఆమోదయోగ్యమేనన్నారు ఆ పార్టీ నేత నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ. పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడి పదవికి సిద్ధూ రాజీనామాపై శుక్రవారం పార్టీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

  • మాస్టర్​ ప్లాన్​

మల్టీ మోడల్ కనెక్టివీటీ పేరుతో కేంద్రం గతిశక్తి కార్యక్రమాన్ని రూపొందించింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం రూపొందించిన నేషనల్ మాస్టర్ ప్లాన్.. ప్రభుత్వం చేపట్టిన పనులు సకాలంలో పూర్తయ్యేలా చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

  • ఎంత పెద్ద గుమ్మడి కాయో..!

ఓ రైతు పండించిన గుమ్మడికాయ ప్రపంచంలోనే అత్యధిక బరువైనదిగా (Pumpkin Weight Record) రికార్డు సృష్టించింది. మరి ఈ భారీ గుమ్మడికాయ బరువు ఎంతో తెలుసా?

  • దేశంలో ఊపందుకుంటున్న డ్రోన్ల పరిశ్రమ

భారత్​లో డ్రోన్ల పరిశ్రమకు ఆదరణ పెరుగుతోంది. ప్రపంచంలో సైనిక డ్రోన్లను పెద్దయెత్తున దిగుమతి చేసుకొంటున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానాన ఉంది. ఇటీవలి వరకు యూఏవీల వినియోగంపై జాగ్రత్తలు పాటించిన ప్రభుత్వం- ఇక గరిష్ఠ స్థాయిలో వాటి వినియోగాన్ని ప్రోత్సహించాలనుకొంటోంది.

  • కోహ్లీపై ఒత్తిడి తగ్గాలంటే

టీమ్ఇండియా ఓపెనింగ్​ బ్యాటర్​ కేఎల్​ రాహుల్​ అద్భుతంగా రాణిస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ బ్రెట్​ లీ అన్నాడు. ఐపీఎల్​లో అత్యధిక పరుగులు చేసిన కేఎల్​ రాహుల్​.. టీ20 ప్రపంచకప్​లోనే టాప్​ స్కోరర్​గా నిలిచే అవకాశం ఉందని తెలిపాడు. కేఎల్​ రాహుల్​ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే.. కెప్టెన్​ కోహ్లీపై ఒత్తిడి తగ్గుతుందని అన్నాడు.

  • కుటుంబం అంతా కలిసి చూసే సినిమా 

'మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్' ప్రేమకథే అయినప్పటికీ చాలా కొత్తగా తీశారని హీరో అఖిల్ అన్నాడు. కుటుంబం అంతా కలిసి ఈ సినిమా చూడొచ్చని తెలిపాడు.

Last Updated : Oct 15, 2021, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.