రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 57వేల 621మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... అందులో 2వేల 381మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మరో 1659మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నట్టు స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 27లక్షల 41వేల 836 మందికి వైరస్ పరీక్షలు చేయగా... అందులో లక్షా 81వేల 627మందికి కరోనా సోకింది. తాజాగా మరో 2021మంది కోలుకోగా ఇప్పటి వరకు మహమ్మారి నుంచి బయటపడిన వారి సంఖ్య లక్షా 50వేల 160కి పెరిగింది. ఇక మరో 10మంది వైరస్‌తో మృతి చెందగా.... రాష్ట్రంలో కరోనా మరణాలు 1080కి చేరాయి.
కరోనా వెలుగు చూసిన తొలినాళ్లలో వైరస్ సోకిన ప్రతి ఒక్కరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందగా... ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ప్రస్తుతం 30వేల 387యాక్టివ్ కేసులు ఉండగా... అందులో 24వేల 592మంది ఐసోలేషన్‌లో ఉండటం గమనార్హం. తాజాగా నమోదైన కేసుల్లో ఆదిలాబాద్ 15, భద్రాద్రి కొత్తగూడెం 97, జీహెచ్ ఎంసీ 386, జగిత్యాల 51, జనగామ 23, భూపాలపల్లి 19, గద్వాల 25, కామారెడ్డి 58, కరీంనగర్ 119, ఖమ్మం 84, ఆసిఫాబాద్ 13, మహబూబ్ నగర్ 42, మహబూబాబాద్ 68, మంచిర్యాల 29, మెదక్ 39, మల్కాజిగిరి 193, ములుగు 15, నాగర్ కర్నూల్ 67, నల్గొండ 132, నారాయణ పేట 43, నిజామాబాద్ 69, పెద్దపల్లి 31, సిరిసిల్ల 70, రంగారెడ్డి 227, సంగారెడ్డి 50, సిద్దిపేట 86, సూర్యాపేట 78, వికారాబాద్ 23, వనపర్తి 58, వరంగల్ రూరల్ 24, వరంగల్ అర్బన్ 83, యాదాద్రి భువనగిరి లో 52 చొప్పున నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: దేశంలో 58 లక్షలు దాటిన కరోనా కేసులు