ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లోనే 5,963 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా.. 27 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48,053 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
జిల్లాల వారీగా కేసులు
గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1182 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు 938, శ్రీకాకుళం 893, తూర్పుగోదావరి 626, విశాఖ 565, నెల్లూరు 491, కర్నూలు 434, ప్రకాశం 280, కడప 189, కృష్ణా 171, అనంతపురం 156, విజయనగరం 19, పశ్చిమగోదావరి 19 కేసుల చొప్పున నమోదయ్యాయి.
జిల్లాల వారీగా మరణాలు
గత 24 గంటల వ్యవధిలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఆరుగురు వైరస్ బారిన పడి మృతి చెందారు. చిత్తూరు 4, నెల్లూరు 4, గుంటూరు 2 , కడప 2, కర్నూలు 2, ప్రకాశం 2, శ్రీకాకుళం 2, విశాఖ 2, అనంతపురం 1 చొప్పున ప్రాణాలు విడిచారు.
ఇదీచదవండి: సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్