ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8లక్షల 81 వేల61కు చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 105, కృష్ణాలో 67 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమగోదావరిలో 3, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో 8 చొప్పున నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3625 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 422 మంది వైరస్ నుంచి కోలుకున్నారని.. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8 లక్షల 70 వేల 342గా పేర్కొంది. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో వైరస్ కారణంగా ఒకరు చొప్పున మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7094కు చేరింది. తాజాగా 46 వేల 386 నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 1 కోటి 16 లక్షల20 వేల503 మందికి పరీక్షలు చేసినట్లుగా వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 7.58గా నమోదైంది.
ఇదీ చూడండి: త్వరలో ఎన్నికలకు కోఆర్డినేటర్లను ఎంపిక చేసిన భాజపా