ETV Bharat / city

భాగ్యనగరం ఊపిరి పీల్చుకుంది వారి వల్లనే...

వరుణుడి ప్రకోపంతో భాగ్యనగరం అస్తవ్యస్తమయింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో వీధులన్నీ ఏరులై... వాగులను తలపించాయి. నాలాలన్నీ పొంగి పొర్లి.. చెరువులన్నీ కూడబలుక్కుని ఎక్కడికక్కడే గట్లు తెగి.. ఉగ్రరూపంతో నగరాన్ని ముంచెత్తాయి. చిగురుటాకుల్లా వణికిపోతున్న ప్రజలకు ఆపద్బంధులా నిలిచింది డీఆర్​ఎఫ్​. కష్టకాలంలో మేమున్నామంటూ విపత్తు నిర్వహణ బృందాలు ప్రదర్శించిన సాహసాలు ఎందరో ప్రాణాలను నిలబెట్టాయి.

భాగ్యనగరం ఊపిరి పీల్చుకుంది వారి వల్లనే...
భాగ్యనగరం ఊపిరి పీల్చుకుంది వారి వల్లనే...
author img

By

Published : Oct 29, 2020, 12:24 PM IST

భాగ్యనగరం ఊపిరి పీల్చుకుంది వారి వల్లనే...

నడిరోడ్డుపై ఉద్ధృతంగా ప్రవాహం. భారీ వాహనాలే పడవల్లా కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికక్కడే విరిగిపడిన స్తంభాలు, తెగిపడిన వైర్లు.. కూలిపోతున్న గృహాలు.. కాపాడండి అంటూ ఆర్తనాదాలు. చుట్టుముట్టిన వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు. ఇది వరదల సమయంలో భాగ్యనగరంలో కనిపించిన దృశ్యాలు.

ఆ సమయంలో మేమున్నామంటూ జీహెచ్​ఎంసీ సకాలంలో స్పందించి విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపింది. విల్లు నుంచి వదిలిన శరములా దూసుకొస్తున్న ప్రవాహానికి ఎదురొడ్డి... కొట్టుకుపోతున్న వారి ప్రాణాలను నిలబెట్టి... నిరాశ్రయులైన వారికి నీడనిచ్చి... ఆకలన్న వారికి అన్నం పెట్టి.. అన్ని వేళలా అండగా నిలిచింది డీఆర్​ఎఫ్​. సుమారు 800 మంది శిక్షణ పొందిన సిబ్బందితో రెస్కూ ఆపరేషన్​ నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది జీహెచ్​ఎంసీ.

కలలో కూడా ఎరగని... ఊహించని విపత్తు చుట్టుముట్టిన వేళ మేమున్నామంటూ అండగా నిలిచారు విపత్తు నిర్వహణ బృందాలు. వరదల సమయంలో వారు ప్రదర్శించిన సాహసాలు... నిలబెట్టిన ప్రాణాలు చేసిన వాళ్లు మరచిపోవచ్చేమో గానీ... పొందిన భాగ్యనగరం ఎప్పటికీ మరచిపోదు. వారి నిర్విరామ కృషితోనే అతి కొద్ది రోజుల్లోనే నగరంలో సాధారణ పరిస్థితులు వచ్చాయనడంలో అతిశయోక్తి లేదు.

ఇదీ చూడండి: పర్వతగిరి సీఐ కిషన్​కు పోలీస్ బాస్ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.