ETV Bharat / city

'ఆధునిక అంతర్జాల యుగంలో డేటా విశిష్టత అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది' - ఎన్‌ఎస్‌ఓ డైరెక్టర్ జనరల్ తాజా వార్తలు

National Wide Quiz Contest on Statistics: ఆధునిక అంతర్జాల యుగంలో డేటా విశిష్టత అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని ఎన్‌ఎస్‌ఓ డైరెక్టర్ జనరల్ డి.సతీష్‌ అన్నారు. ఆజాదీకా అమృత్​ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని జూబ్లీహిల్స్ ఎంసీఆర్​హెచ్​ఆర్​డీలో "అన్వేష - 2022" పేరిట నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

National Wide Quiz Contest on Statistics

author img

By

Published : Jun 28, 2022, 12:27 AM IST

Updated : Jun 28, 2022, 6:27 AM IST

National Wide Quiz Contest on Statistics: ప్రపంచంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఆధునిక అంతర్జాల యుగంలో డేటా విశిష్టత అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని జాతీయ గణాంకాల ప్రాంతీయ కార్యాలయం ఎన్‌ఎస్‌ఓ డైరెక్టర్ జనరల్ డి.సతీష్‌ అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్యానంతరం దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న మహానీయులను స్మరించుకుంటూ 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు-ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జాతీయ గణాంక, పథకాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో "అన్వేష - 2022" పేరిట నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

విద్యార్థులను ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈ తరహా పోటీలు ఇతోధికంగా దోహదపడాలని ఎన్‌ఎస్‌ఓ డైరెక్టర్ జనరల్ డి.సతీష్ సూచించారు. దేశంలో బాలికల అభ్యున్నతి కోసం బేటి బచావో- బేటి పడావో సహా డేటా, గణాంక శాఖ ప్రాముఖ్యత గణాంకాలు, బిగ్ డేటా, డేటా అనాలిసిస్‌లో ప్రపంచ అభివృద్ధికి దోహదపడతాయని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ తరహా విజ్ఞాన పరీక్షలు పోటీతత్వం పెంపొందించుకోవడానికి తోడ్పడతాయన్నారు. అలాగే ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ అసోసియేట్ ప్రొఫెసర్ రావులపాటి మాధవి క్విజ్‌ మాస్టర్‌గా వ్యవహరించారు. జంట నగరాల్లో వివిధ కళాశాలల నుంచి 70 బృందాలు ఈ వకృత్వ పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీల్లో సైఫాబాద్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ విద్యార్థులు జి.బాలమురళీకృష్ణ, జి.నవీన్, కాదంబరి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్, స్టాటిస్టిక్స్ డైరెక్టర్ దయానంద, యునాని మెడిసిన్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మినాజుద్దీన్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ధి పరిశోధక శాఖ డైరెక్టర్ దివ్య పరమార్, ఎన్‌ఎస్‌ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కె.శివపార్వతిరెడ్డి, సీనియర్ అధికారి భరత్‌రాజ్‌ దోశబోయిన పాల్గొన్నారు.

'ఆధునిక అంతర్జాల యుగంలో డేటా విశిష్టత అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది'

ఇవీ చదవండి:

Last Updated : Jun 28, 2022, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.