సింగరేణి అనుమతులు లేకుండా చేస్తున్న మైనింగ్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా అదనపు మైనింగ్ చేస్తున్నారని ఆగ్రహించింది. నందు నాయక్, శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఎన్జీటీ-చెన్నై బెంచ్... పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్ చేయెుద్దని ఆదేశించింది. అదనపు మైనింగ్‌పై ఎన్జీటీకి నిపుణుల కమిటీ ఆధారాలు సమర్పించింది.
ఇప్పటికే చేపట్టిన అక్రమ మైనింగ్‌కు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించిన జాతీయ హరిత ట్రైబ్యునల్... కాలుష్యం బారినపడిన బాధితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పర్యావరణ కాలుష్యంపై చర్యలు తీసుకోలేదని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన హరిత ట్రైబ్యునల్... తదుపరి విచారణను ఆగస్టు 12కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: 'వివాద పరిష్కారాలలో రాజ్యాంగ సమానత్వం ఉండాలి'