ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో మరోసారి విచారణ జరగనుంది. తమ వాదనలు వినాలంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను ఎన్జీటీ విచారణకు స్వీకరించింది. ఈ పథకంపై తమ వాదనలు వినిపించేందుకు, అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సమయం సరిపోలేదని... ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. పరిశీలించిన ట్రైబ్యునల్... రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినేందుకు అంగీకరించింది. ఈ నెల 28న తుది వాదనలు వింటామని జస్టిస్ రామకృష్ణన్ ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ వేయగా.. ఎన్జీటీ తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌తో మరోసారి విచారణ జరగనుంది.
ఇదీ చూడండి: గుడారాల్లో పెరిగింది... నాయకత్వ పాఠాలు చెబుతోంది!