హైదరాబాద్ మలక్‌పేటలోని నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మప్రియ జాతీయ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 47 మంది ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను కేంద్ర విద్యా శాఖ ఖరారు చేసింది. జాతీయ అవార్డు కోసం తెలంగాణ నుంచి ఆరుగురు ఉపాధ్యాయుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది.
వారందరికీ ఈ నెల 13న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పురస్కారాల కమిటీ ముఖాముఖి నిర్వహించగా.... గణితం ఉపాధ్యాయురాలు పద్మప్రియను అవార్డు వరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరుగురిని సిఫార్సు చేయగా.. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మధుబాబు జాతీయ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.