కొవాగ్జిన్‌తో పాటు ముక్కు ద్వారా వేసే టీకాను భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ఫిబ్రవరి-మార్చిలో ముక్కు ద్వారా అందించే టీకా తొలిదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నారు.
వాషింగ్టన్ వర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి భారత్ బయోటెక్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇప్పటికే దేశంలో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది.
ముక్కు ద్వారా ఇచ్చే టీకా ఒక్క డోసు మాత్రమే ఇస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ వ్యాక్సిన్‌తో మెడికల్ వ్యర్థాలు గణనీయంగా తగ్గనున్నట్లు వెల్లడించింది.
- ఇదీ చూడండి : 1,200 కేంద్రాల్లో కొనసాగుతున్న కొవిడ్ టీకా డ్రై రన్