రిపబ్లిక్ సినిమా(republic movie news) గురించి మంచి రివ్యూలు వింటున్నానంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు(lokesh tweet about republic movie news). త్వరలోనే సినిమా చూడనున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్(sai dharam tej news) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
వైకాపా నేతలు.. జనసేన కార్యకర్తలు పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్నారు. అధికారపార్టీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష తెలుగుదేశం సమర్థించింది. ఈ నెల ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విడుదలను నరసన్నపేటలో వైకాపా శ్రేణులు అడ్డుకోవటమూ వివాదాస్పదమైంది. రాజకీయ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాపై తాజాగా లోకేశ్ ట్వీట్ చేయటం రాజకీయ వర్గాలు, మెగా ఫ్యాన్స్‌లోనూ చర్చనీయాంశమైంది.
-
Hearing some great reviews about #RepublicMovie. Looking forward to watch @devakatta and @iamsaidharamtej’s phenomenal work soon. Wishing Tej a speedy recovery and good health! #REPUBLIC pic.twitter.com/6KahQSnA8c
— Lokesh Nara (@naralokesh) October 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hearing some great reviews about #RepublicMovie. Looking forward to watch @devakatta and @iamsaidharamtej’s phenomenal work soon. Wishing Tej a speedy recovery and good health! #REPUBLIC pic.twitter.com/6KahQSnA8c
— Lokesh Nara (@naralokesh) October 3, 2021Hearing some great reviews about #RepublicMovie. Looking forward to watch @devakatta and @iamsaidharamtej’s phenomenal work soon. Wishing Tej a speedy recovery and good health! #REPUBLIC pic.twitter.com/6KahQSnA8c
— Lokesh Nara (@naralokesh) October 3, 2021
ఇదీ చదవండి: BANDI SANJAY : అమ్మవారి ఆశీస్సులతో హుజూరాబాద్‌లో జయకేతనం ఎగరేస్తాం