ETV Bharat / city

Nara Lokesh: ఆమెది ఆత్మహత్య కాదు.. జ‌గ‌న్ రెడ్డి పార్టీ నేత చేసిన హ‌త్య: నారా లోకేశ్ - తెదేపా అంగన్​వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

Lokesh on VOA Nagalaxmi Suicide: ' కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి వీవోఏ నాగ‌ల‌క్ష్మిది ఆత్మహ‌త్య కాదు.. జ‌గ‌న్ రెడ్డి పార్టీ నేత చేసిన హ‌త్య' అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే నాగలక్ష్మి బలవన్మరణానికి పాల్పడేది కాదన్నారు.

Nara Lokesh
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​
author img

By

Published : Mar 18, 2022, 6:06 PM IST

Lokesh on VOA Nagalaxmi Suicide: 'వీవోఏ నాగ‌ల‌క్ష్మిది ఆత్మహ‌త్య కాదు.. జ‌గ‌న్ రెడ్డి పార్టీ నేత చేసిన హ‌త్య' అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి వీవోఏ నాగలక్ష్మి.. తాము చెప్పిన‌ట్టు విన‌డంలేద‌ని వైకాపా నేత నరసింహారావు వెంటాడి వేధించ‌డంపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చ‌ర్యలు తీసుకుని ఉంటే ఆమె బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడేది కాదన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా వైకాపా నేత నుంచి మ‌హిళను ర‌క్షించ‌లేక‌పోయారంటే.. రాష్ట్రంలో పోలీసు వ్యవ‌స్థ ఎంత‌గా భ్రష్టు ప‌ట్టిందో తెలుస్తుందని లోకేశ్​ విమర్శించారు. ముఖ్యమంత్రి.. మీకు ఓట్లేసి గెలిపించింది ప్రజ‌ల‌కి ర‌క్షకులుగా ఉంటార‌ని.. ప్రజ‌ల్నే భ‌క్షిస్తార‌ని కాదని ధ్వజమెత్తారు.

సొంత చెల్లెలిని తెలంగాణ త‌రిమేసి, బాబాయ్​ను చంపేసి ఆయ‌న కుమార్తె ప్రాణాల‌కు ర‌క్షణ‌లేకుండా చేసిన జ‌గ‌న్‌రెడ్డిని ఆద‌ర్శంగా తీసుకుని గ్రామ‌స్థాయిలోనూ వైకాపా నేత‌లు మ‌హిళల‌ ప్రాణాలు తీసేస్తున్నారని మండిపడ్డారు. చ‌ట్టాన్ని చుట్టంగా చేసుకున్న వైకాపా నేత‌ల అరాచ‌కాల‌కు పోలీసుల‌కు అండ‌గా ఉన్న ప‌రిస్థితుల్లో ప్రజ‌లంతా క‌లిసి తిరుగుబాటు చేయాలని.. అప్పుడే ప్రజ‌ల ధ‌న‌మాన ప్రాణాల‌కు ర‌క్షణ దొరుకుతుందని లోకేశ్​ స్పష్టం చేశారు.

ఆ నిజం ముఖ్యమంత్రికి తెలియదా..?: సునీత

నేరచరితుడైన ముఖ్యమంత్రి అండదండలతో వైకాపా కాలకేయులు, కామాంధులు.. ఆడబిడ్డలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తెదేపా అంగన్​వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మండిపడ్డారు. వైకాపా నేత వేధింపులకు బలైన నాగలక్ష్మి, యడ్లపాడు మండలం బోయపాలెంలో అధికార పార్టీ నేత కుమారుడి దాష్టీకానికి గురైన అంగన్​వాడీ ఆయా కుటుంబాలకు సీఎం జగన్​ ఏం న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దారుణాలకు ప్రధాన కారకులు తన పార్టీవారేనన్న నిజం ముఖ్యమంత్రికి తెలియదా అని నిలదీశారు.

మహిళా హోంశాఖ మంత్రి రబ్బర్ స్టాంపులా మారితే, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి ముఖ్యమంత్రి భజనలో మునిగితేలుతూ.. అసలు వాస్తవాలు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అంగన్​వాడీ కేంద్రాల దుస్థితి ఎలా ఉందో.. ? అక్కడి చిన్నారులు ఎందుకు ఆకలికేకలు వేస్తున్నారో ఏనాడైనా మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఆలోచించారా..? అని సునీత ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

కృష్ణాజిల్లా సీఐటీయూ నాయకురాలు ఆత్మహత్య... అధికార పార్టీ నేత వేధింపులే కారణం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.