ETV Bharat / city

పోలీస్​స్టేషన్​ నాకు అత్తారిల్లులా మారిపోయింది: నారా లోకేశ్​ - anna canteen

Nara Lokesh latest news: అన్న క్యాంటీన్ల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్లను చూసి ప్రభుత్వం భయపడుతోందన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక తనకు పోలీస్​స్టేషన్​ అత్తారిల్లులా మారిపోయిందని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల మరణించిన పాటిబండ్ల నరేంద్రనాథ్‌ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.

పోలీస్​స్టేషన్​ నాకు అత్తారిల్లులా మారిపోయింది: నారా లోకేశ్​

author img

By

Published : Sep 8, 2022, 5:40 PM IST

Nara Lokesh latest news: ఏపీ ప్రభుత్వం పేదలకు అన్నం పెట్టడం సంగతి అటుంచి.. అన్న క్యాంటీన్లు పెట్టిన వారిపై దాడి చేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల మరణించిన పాటిబండ్ల నరేంద్రనాథ్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పార్టీ తరుఫున అండగా ఉంటామని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లను అన్నిచోట్లా ప్రభుత్వం అడ్డుకుంటోందని లోకేశ్ ధ్వజమెత్తారు. అన్న క్యాంటీన్లను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. వైకాపా నేతల దాడులకు భయపడేది లేదని.., అధికారంలోకి వచ్చాక అన్నీ తేల్చుకుంటామని హెచ్చరించారు. తనపైనా 15 కేసులు పెట్టారని.., 7 సార్లు పోలీస్‌స్టేషన్‌ తీసుకువెళ్లారని అన్నారు. గతంలో ఎన్నడూ స్టేషన్‌ గడప తొక్కని తనకు.. ఇప్పుడు పోలీస్‌స్టేషన్‌ అత్తారిల్లులా మారిపోయిందని చమత్కరించారు.

"2019 ఎన్నికల తర్వాత నరేంద్రనాథ్ నాకు పరిచయమయ్యారు. నరేంద్రనాథ్ కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది. మంగళగిరి, కుప్పం, తెనాలిలో అన్న క్యాంటీన్లను అడ్డుకున్నారు. ఈ ప్రభుత్వం అన్నం పెట్టదు. పెట్టేవాళ్లను కొడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంతగా భయపడుతుంది. తెదేపా నేతలపై దాడులు జరుగుతున్నాయి. రేపు మా ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఊరుకునేది లేదు. జగన్ తాత రాజారెడ్డికే భయపడలేదు. ఈయనకు భయపడతామా?. నాపై 15 కేసులు పెట్టారు. 7 సార్లు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీస్​స్టేషన్​ నాకు అత్తారిల్లులా మారిపోయింది." -నారా లోకేశ్​

ఇవీ చదవండి:

ఏఈఈ ఉద్యోగమే మీ లక్ష్యమా.. ఈ పుస్తకాలు చదవండి.. జాబ్ పట్టేయండి

భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం రూట్ మ్యాప్ సిద్ధం.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.